ఇంట్లో బంధించి.. మద్యం తాగించి; మత్తులో ఉన్న భార్యను దారుణంగా కొట్టి చంపిన భర్త
కట్టుకున్న ఇల్లాలిని కర్కశంగా హతమారుస్తున్న భర్తల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమె పాలిట కాలయముడయ్యాడు. ముగ్గురు పిల్లల సాక్షిగా అతి కిరాతకంగా ఆమెను హింసించి కొట్టి చంపాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్ నగర్ బతుకమ్మ బండలో చోటుచేసుకున్న దారుణ ఘటన వివరాల్లోకి వెళితే..

భార్యపై అనుమానం... నిత్యం గొడవలు
బతుకమ్మ బండలో నివాసముండే మమత, బాలకృష్ణ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. బాలకృష్ణ ఇద్దరు కుమారులతో కలిసి ఏసీ సర్వీసింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మమత ఇంట్లోనే ఉంటుంది. గత కొంతకాలంగా భార్యాభర్తల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మమతను అనుమానిస్తున్న బాలకృష్ణ భార్యతో నిత్యం గొడవకు దిగుతున్నాడు.

ఇంట్లో బంధించి మద్యం తాగించి మత్తులో ఉండగా తీవ్రంగా కొట్టిన భర్త .. భార్య మృతి
ఈ క్రమంలో తాజాగా మమతను ఇంట్లో బంధించి మద్యం తాగిస్తూ మత్తులో ఉంచి ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. కొన్ని గంటలపాటు మమతను విపరీతంగా కొట్టడంతో, దెబ్బలకు తాళలేక మమత మృతి చెందింది. మమత మృతిచెందిన విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడాలి అనుకున్న బాలకృష్ణ పక్క ప్లాన్ ప్రకారం మృతదేహాన్ని తరలించాలని ప్రయత్నం చేశాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు తల్లి మమత మృతిచెందిన విషయం ఆమె ఇద్దరు కుమారులతో పాటుగా కుమార్తెకు కూడా తెలుసు.

శవంతోనే పిల్లలు... గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని తరలించే యత్నం
తల్లి మరణించిన తర్వాత వారి ఇంటి తలుపులు, గేట్లు మూసివేసి మృతదేహంతో ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఇల్లంతా శుభ్రంగా కడిగి, మధ్యాహ్నం 1:00 సమయంలో మమత మృతదేహాన్ని తరలించడానికి ప్లాన్ వేసుకుని అంబులెన్స్ ను పిలిపించారు. అంబులెన్స్ లో మమత మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు అనుమానం వచ్చి మమతకు ఏమైంది అంటూ ప్రశ్నించారు. మమత ఒంటిపై దెబ్బలు ఉన్నాయ్ ఏంటి అంటూ భర్తను నిలదీశారు. అయితే మమత నిన్నటి నుండి కనిపించలేదని, ఆమె అపస్మారక స్థితిలో బయట దొరికితే తీసుకువచ్చానని బాలకృష్ణ కట్టు కథ చెప్పే ప్రయత్నం చేయబోయాడు.

అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం .. ఘాతుకం వెలుగులోకి
అయితే అనుమానం వచ్చిన స్థానికులు నిలదీసి, పోలీసులకు సమాచారం అందించగా బాలకృష్ణ చేసిన పని బయటపడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు శవ పంచనామా నిర్వహించి మమత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మమత ఒంటి పై తీవ్రమైన దెబ్బలను గుర్తించారు. ఆమె భర్త మమతను దారుణంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. దీంతో భర్త బాలకృష్ణతో పాటు కుమారులు లక్ష్మణ్, శంకర్ లను సైతం పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. అసలు ఏం జరిగిందన్న దానిపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మమత మృతితో స్థానికుల ఆగ్రహం .. శిక్ష పడేలా చేస్తామన్న పోలీసులు
అయితే మమతను హతమార్చిన నిందితుడిని తామే శిక్షిస్తామని స్థానికులు కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా మహిళలు బాలకృష్ణను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక పోలీసులు వారిని సముదాయించి నేరస్తులకు శిక్షపడేలా చేస్తామని చెప్పి వారిని శాంతింపజేశారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications