నేటితో హుజురాబాద్ నామినేషన్ల దాఖలుకు తెర, ఈటల రాజేందర్, బలమూర్ వెంకట్ నామినేషన్లు నేడే!!

హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈరోజుతో నామినేషన్ల గడువు ముగియనుంది. అక్టోబరు 1వ తేదీ నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా శుక్రవారం సాయంత్రంతో నామినేషన్లకు తెర పడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం విధించిన కోవిడ్ ప్రోటోకాల్స్ తో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

తొలిరోజు నామినేషన్లు దాఖలు చేసిన గెల్లు .. చివరి రోజు ఈటల, బలమూర్ వెంకట్

తొలిరోజు నామినేషన్లు దాఖలు చేసిన గెల్లు .. చివరి రోజు ఈటల, బలమూర్ వెంకట్

ఇదిలా ఉంటే నామినేషన్ల పరిశీలన 11వ తేదీన జరగనుండగా ఆపై నామినేషన్ల ఉపసంహరణ 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఎన్నికల సంఘం జారీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 30వ తేదీన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్లలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే టిఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున బిజెపి పార్టీ నుంచి బరిలోకి దిగిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగుతున్న బలమూర్ వెంకట్ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

ఈటల రాజేందర్, బలమూర్ వెంకట్ నామినేషన్ ల దాఖలుకు హాజరయ్యే వారు వీరే

ఈటల రాజేందర్, బలమూర్ వెంకట్ నామినేషన్ ల దాఖలుకు హాజరయ్యే వారు వీరే

ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హుజురాబాద్ ఉప ఎన్నిక ఇన్చార్జి జితేందర్ రెడ్డి తో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలమూర్ వెంకట్ కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు వెంకట్ వెంట నామినేషన్ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్లమెంటరీ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ లతోపాటు పలువురు సీనియర్ నాయకులు హాజరు కానున్నారు.ఇదిలా ఉంటే హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇప్పటి వరకు 15 నామినేషన్లు దాఖలయ్యాయి .

 ఇప్పటి వరకు 15 నామినేషన్లు దాఖలు

ఇప్పటి వరకు 15 నామినేషన్లు దాఖలు

మొదటి రోజు రెండు నామినేషన్లు దాఖలు కాగా, గురువారం నాడు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు 15 మంది ఎన్నికల బరిలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు ఈ రోజు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటుగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ లు కూడా పెద్ద ఎత్తున ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలు అంకం ముగిస్తే మరింత దూకుడుగా పార్టీల నేతలు ప్రచార పర్వంలో ముందుకు వెళ్లనున్నారు.

జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం .. ఎవరి వ్యూహాలు వారివే !!

జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం .. ఎవరి వ్యూహాలు వారివే !!

ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ నుండి, హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 మంది స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించే బాధ్యత తీసుకున్న మంత్రి హరీష్ రావు పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ నుండి మంత్రులు, ఎమ్మెల్యేల దాకా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి నుండి ఎన్నికల బరిలోకి దిగిన ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ హుజురాబాద్ ప్రజల మద్దతు కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ప్రజలంతా కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారని బలంగా నమ్ముతున్నారు. బిజెపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దొరల అహంకారం అణచడానికి, తెలంగాణా ఆత్మ గౌరవం కోసం తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికంటే ఆఖరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ కూడా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+