Huzurabad Results: టీఆర్ఎస్ కు రోటీ మేకర్ షాక్, స్వల్ప ఆధిక్యతతో బీజేపీకి భయం, టీఆర్ఎస్ లో టెన్షన్ !!
టీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడిందే జరుగుతుంది. హుజురాబాద్ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు పడుతున్న ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తున్నాయి. కారు గుర్తును పోలిన గుర్తులు ఉండటంతో తమ ఓట్లు ఆయా గుర్తులకు పోల్ అయ్యే అవకాశం ఉందని ముందు నుండి ఆందోళన వ్యక్తం చేసిన టీఆర్ఎస్ కు ఉప ఎన్నికల ఫలితాల్లో ఊహించిందే జరుగుతుంది.ఇండిపెండెంట్ అధ్యర్తుల గుర్తులు కూడా పెద్ద ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలలో బీజేపీ స్వల్ప ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇక ఇండిపెండెంట్ గుర్తు రోటీ మేకర్ టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికలో ఓటమి పాలైతే సీఎం కేసీఆర్ కు, టీఆర్ ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టే అన్న చర్చ రాష్ట్రంలో ఇప్పుడు కౌంటింగ్ వేళ జోరుగా సాగుతుంది. టీఆర్ఎస్ వర్గాలలో ఆందోళన మొదలైంది.

టీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్న ఫలితాల ట్రెండ్
హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. నువ్వా నేనా అన్నట్టు అధికార టీఆర్ఎస్ పార్టీ, బిజెపి ఈ ఎన్నికల బరిలో తలపడ్డారు. కెసిఆర్ అహంకారానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలుగా ఈ ఎన్నికను బీజేపీ నేతలు అభివర్ణించారు. అభివృద్ధిని చూసి ఓటేయమని, బీజేపీకి ఓటేస్తే పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరల పెంపును అంగీకరిస్తున్నట్లే అని టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇక హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార బాధ్యతను భుజాల మీద వేసుకొని ఆర్థిక శాఖ, అక్కడే ఉండి ఎన్నికల మంత్రంగం నడిపించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ వస్తున్న ఫలితాలు టిఆర్ఎస్ పార్టీ ని టెన్షన్ పెడుతున్నాయి. భవిష్యత్తు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీపై ఈ ఎన్నికల ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఆధిక్యంలో బీజేపీ .. అయినా టెన్షన్ .. స్వల్ప మెజార్టీనే కారణం
ఇటు బిజెపిలో సైతం హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు అనుకూలంగా వస్తున్నప్పటికీ, టెన్షన్ పుట్టిస్తున్నాయి. స్వల్ప మెజారిటీతో ఇప్పటివరకు మూడు రౌండ్లలో నూ బిజెపి ఆధిక్యాన్ని కొనసాగినప్పటికీ, చివరి వరకు ఆధిక్యం కొనసాగుతుందా.. లేదా అన్నది బీజేపీ వర్గాలలో ఆందోళన కలిగిస్తుంది. తామే గెలుస్తామని బయట ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, లోపల ఏదైనా జరగొచ్చు అన్న ఆందోళన బిజెపి శ్రేణుల్లో కనిపిస్తుంది. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వీవీ ప్యాట్ లను ఒక ప్రైవేటు వాహనంలో కి మార్చి తీసుకు వెళ్లడం పై బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ అది చివరి వరకూ కొనసాగుతుందా లేదా అన్న ఆందోళన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.

టీఆర్ఎస్ కు ఇండిపెండెంట్ ల షాక్ .. రోటీ మేకర్ కు పడుతున్న ఓట్లు
ఇదిలా ఉంటే ఊహించిన విధంగానే ఇండిపెండెంట్లు టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. కారు గుర్తును పోలిన గుర్తులతో ఎన్నికల బరిలోకి దిగిన ఇండిపెండెంట్ అభ్యర్థులు టిఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. హుజురాబాద్ లో రోటి మేకర్ కు 122 ఓట్లు పోలవటం టిఆర్ఎస్ నేతలకు ఆందోళన కలిగిస్తుంది. గతంలోనూ టీఆర్ఎస్ పార్టీకి రోడ్ రోలర్, హెలికాప్టర్, చపాతి మేకర్ లాంటి గుర్తులు నష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఎన్నికలలోనూ అదే పంధా కొనసాగుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకూ వచ్చిన ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ పార్టీకి షాక్ కాగా, బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అయిన డిపాజిట్లు దక్కించుకుంటుందో లేదో అనుమానంగా పరిస్థితి ఉంది.

పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యత
కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు అధికారులు. మొత్తం 723 పోస్టల్ బ్యాలెట్ లలో టిఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచింది. పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ పార్టీకి 503 ఓట్లు, బిజెపికి 159 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి 32 ఓట్లు పోల్ కాగా, 14 ఓట్లు చెల్లకుండా పోయాయి. పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యాన్ని కనబరిచిన టిఆర్ఎస్ పార్టీ, మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి 166 ఓట్ల తేడాతో వెనుకబడింది.
Recommended Video

మూడు రౌండ్ల కౌంటింగ్ లోనూ బీజేపీ ఆధిక్యత
మొదటి రౌండ్లో 9894 ఓట్ల లెక్కింపు చేయగా, టిఆర్ఎస్ పార్టీకి 4444 ఓట్లు పోలయ్యాయి. బిజెపికి 4610 ఓట్లు పోల్ కాగా , కాంగ్రెస్ పార్టీకి 119 ఓట్లు పడ్డాయి. మొదటి రౌండ్లో టిఆర్ఎస్ పార్టీ కంటే బిజెపి 166 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచింది. ఇక రెండవ రౌండ్లో కూడా బిజెపి తన ఆధిక్యాన్ని కొనసాగించింది. రెండవ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 9103 ఓట్లు పోల్ కాగా, బిజెపికి 9461 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 339 ఓట్లు పడ్డాయి. ఇక 223 సరికి 359 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. మూడో రౌండ్ ఎన్నికల ఫలితాలు కూడా బిజెపికే అనుకూలంగా ఉండటం, బిజెపి ఆధిక్యాన్ని కనబర్చడం కనిపిస్తుంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications