సిటీ ప్రయాణికులకు అలర్ట్: నేటి నుంచి 11 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్: నరగంలోని ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఆదివారం(ఫిబ్రవరి 4) నుంచి హైదరాబాద్ నగరంలో 11వ తేదీ వరకు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులతోపాటు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
మౌలాలి-సనత్ నగర్ మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నేటి నుంచి అంటే ఆదివారం నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు మొత్తం 51 రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. టైమ్ టేబుల్ ప్రకారం ఈ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 9 వరకు మూడు ఎంఎంటీఎస్ రైళ్లు, 10 వరకు మరో రెండు, ఫిబ్రవరి 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటితోపాటు మౌలాలి-అమ్ముగూడ-సనత్ నగర్ మార్గంలో నడిచే హైదరాబాద్-సిర్పూర్ కాగచ్ నగర్, వికారాబాద్-గుంటూరు, రాయపల్లె-సికింద్రాబాద్-ఎక్స్‌ప్రెస్‌ను షెడ్యూల్ ప్రకారం నిలిపివేయనున్నారు. ఈ క్రమంలో ఎంఎంటీఎస్ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications