Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

merchant: స్నేహితులని రూ. 40 లక్షల అప్పు ఇస్తే..: కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు

హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన స్నేహితులు దారుణంగా హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్చిన అప్పు తిరిగివ్వమన్నందుకే ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం.

అప్పుగా ఇచ్చిన రూ. 40 లక్షలు ఇవ్వమంటే హత్యకు కుట్ర

అప్పుగా ఇచ్చిన రూ. 40 లక్షలు ఇవ్వమంటే హత్యకు కుట్ర

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన మధుసూదన్ రెడ్డి చార్మినార్‌లో వ్యాపారం చేస్తుంటారు. అతడి స్నేహితులు సంజు, గిరీశ్, గాడ్జే తరచూ అక్కడికి వస్తుండేవారు. మధుసూదన్ వద్ద ఈ ముగ్గురు రూ. 40 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మధుసూదన్ అడిగాడు. దీంతో అతడ్ని హతమార్చేందుకు కుట్రపన్నారు.

కిడ్నాప్ డ్రామా ఆడేందుకు ప్లాన్..

కిడ్నాప్ డ్రామా ఆడేందుకు ప్లాన్..

ఆగస్టు 19న మధుసూదన్ రెడ్డిని జగన్నాథ్ అనే కారు డ్రైవర్‌తో కలిసి ఈ ముగ్గురూ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. సంగారెడ్డి సమీపంలోని ఓ దాబా వద్ద ఆగి జగన్నాథ్‌తో పాటు అతని కారును వదిలేసి వేరే కారులో మధుసూదన్ రెడ్డిని తీసుకెళ్లారు. హత్య చేసిన అనంతరం ఈ విషయాన్ని జగన్నాత్‌కు చెప్పి కిడ్నాప్ డ్రామాగా చెప్పాలని ఒప్పించారు. మధుసూదన్ అదృశ్యమైన నేపథ్యంలో అతని కుటుంబసభ్యులు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టారు.

వ్యాపారిని హత్య చేసి ముంబైకి పరారైన నిందితులు

వ్యాపారిని హత్య చేసి ముంబైకి పరారైన నిందితులు

ఈ క్రమంలో కారు నెంబర్ ఆధారంగా జగన్నాథ్‌ను గుర్తించి విచారించగా హత్య విషయం బయటికి వచ్చింది. పొలంలో పూడ్చిపెట్టిన మధుసూదన్ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. నిందితులు మధుసూదన్‌ను హతమార్చిన అనంతరం ముంబై హైవేవైపు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల్లో ఒకరు పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Recommended Video

    interview with HCU students on 2nd Language | Oneindia Telugu
    వనస్థలిపురంలోని లాడ్జీలో ఏపీ వ్యక్తి ఆత్మహత్య

    వనస్థలిపురంలోని లాడ్జీలో ఏపీ వ్యక్తి ఆత్మహత్య

    ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురంలో ఓ లాడ్జీలో ఏపీకి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా పసుపుగల్లు గ్రామానికి చెందిన లారీ యజమాని షేక్ బ్రహ్మం(36). ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయాడు. శనివారం అతని స్నేహితుడు వేణుగోపాల్ తో కలిసి వనస్థలిపురం ఆటోసాయినగర్‌లోని వీఎంఆర్ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్నం ఇద్దరూ కలిసి బార్‌లో మద్యం సేవించి గదిలోకి వెళ్లి పడుకున్నారు. తిరిగి సాయంత్రం బార్‌కి వచ్చి మళ్లీ మద్యం సేవించారు. ఆ తర్వాత షేక్ బ్రహ్మం తన గదిలోకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత తాను చనిపోతున్నానని, ప్రేమించి మోసపోయానని, స్నేహితులు కూడా మోసం చేశారని చెబుతూ ఫ్యాన్‌కు లుంగీతో ఉరేసున్నాడు. ఫేస్‌బుక్ లైవ్ ఈ విషయం చెప్పాడు. ఆ సమయంలో స్నేహితులు, బంధువులు ఫోన్ చేసినా ఫోన్ తీయలేదు.

    వేణుగోపాల్ కూడా పలుమార్లు ఫోన్ చేశాడు. అయినా తీయకపోవడంతో బ్రహ్మం ఉన్న గదికి హుటాహుటిగా వెళ్లాడు. గది తలుపులు వేసి ఉండటంతో కిటికీలోంచి చూసేసరికి ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు. లాడ్జీ సిబ్బందిని పిలిచి గది తలుపులు తెరిపించాడు. అప్పటికే షేక్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+