హైదరాబాద్ ఆదిభట్లలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. మృతుడిని టీసీఎస్‌‌లో సిస్టమ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సత్తి నాగచంద్ర ప్రకాశ్(24)గా గుర్తించారు. అతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా వేములపల్లి.

Hyderabad: A software engineer commits suicide in Adibatla.

బాసర ఐఐటీలో విద్యార్తిని బలవన్మరణం

బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ-1 విద్యార్థిని(16) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెది రంగారెడ్డి జిల్లా మున్నూరు మండలం. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బంధువుల వివాహం ఉండటంతో వారం క్రితం విద్యార్థిని తండ్రి బాసరకు వచ్చి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లాడు. గురువారం ఉదయం ఆమెను తిరిగి ఆర్జీయూకేటీకి తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటలకు తనకు ఫోన్ చేసి ఇంటికి చేరుకున్నావా? అని అడిగిందని ఆమె తండ్రి చెప్పారు.

ఆర్జీయూకేటీ వర్గాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి స్టడీ అవర్స్ కి వెళ్లకుండా ఆమె తన గదిలోనే ఉంది. అదే గదిలో ఉరివేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందింది. ఆమె గదిలో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమించిన వ్యక్తి నెల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతోనే మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు ఆ విద్యార్థిని తన లేఖలో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+