హైదరాబాద్ ఎయిర్ కార్గో సురక్షిత రవాణా.! 100 టన్నులకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా.!

హైదరాబాద్: కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తున్నప్పటి నుండి, ఆ మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో విశిష్ట సేవలందిస్తున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ను సమర్థవంతంగా నిర్వహించడం, పంపిణీ చేయడంలో ఎయిర్ కార్గో నిరంతరం కృషి చేస్తోంది. కరోనావైరస్ దేశంలో వెలుగు చూసిన నాటి నుండి, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్ల వంటి కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ను తీసుకువెళ్ళే అనేక ఫ్రెయిటర్ విమానాలకు ఎయిర్ కార్గో సేవలందించినట్టు తెలుస్తోంది.

జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో విశిష్ట సేవలు.. 11,000 కు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల రవాణా.

జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో విశిష్ట సేవలు.. 11,000 కు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల రవాణా.

కోవిడ్ రోగుల చికిత్సలో కీలకమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అవసరం ఉన్న నేపథ్యంలో వాటిని వేగంగా, సుక్షితంగా, సమర్థంగా హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఎయిర్ కార్గో తన వనరులను సమకూర్చుకుంటోంది. కోవిడ్ వైద్య అవసరాల కోసం హైదరాబాద్‌లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అవసరం చాలా ఉంది. మే ఒకటి నుండి ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి, భారతదేశంలోని ఇతర నగరాల నుండి హైదరాబాద్‌ విమానాశ్రయానికి 11,500 యూనిట్లకు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చాయి. ఇందుకోసం ఎయిర్ కార్గో వివిధ విమానయాన సంస్థలు, కస్టమ్స్, ఫ్రైట్ ఫార్వార్డర్లు, గ్రౌండ్ హ్యాండ్లర్లతో కలిసి పని చేసింది. ఈ కోవిడ్ రిలీఫ్ మెటీరియల్ భారతదేశానికి షెడ్యూల్డ్ విమానాలతో పాటు ప్రత్యేక చార్టర్లలో తరలి వచ్చాయి.

కోవిడ్ వ్యాక్సిన్లు, రిలీఫ్ సామాగ్రి కోసం ఫార్మా జోన్ విస్తరణ.. కీలకం కానున్న హైదరాబాద్ నగరం..

కోవిడ్ వ్యాక్సిన్లు, రిలీఫ్ సామాగ్రి కోసం ఫార్మా జోన్ విస్తరణ.. కీలకం కానున్న హైదరాబాద్ నగరం..

కోవిడ్ రిలీఫ్ మెటీరియల్ సరుకులను వేగంగా క్లియరెన్స్ చేయడానికి కస్టమ్స్ అధికారులు, విమానయాన సంస్థలు, సరుకు రవాణా ఫార్వార్డర్లు, ఇతర వాటాదారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇటీవల, ఒక సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చిన సందర్భంలో వాటి రవాణాకు హైదరాబాద్ కార్గో దోహదపడింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రీ & కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ. కె.టి.రామారావు, ప్రధాన కార్యదర్శి శ్రీ. సోమేష్ కుమార్, వాటిని అందుకున్నారు.

హైదరాబాద్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ.. సురక్షిత రవాణా అంటున్న వైద్య నిపుణులు..

హైదరాబాద్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ.. సురక్షిత రవాణా అంటున్న వైద్య నిపుణులు..

ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు, రష్యా నుండి రెండు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల కన్సైన్‌మెంట్లను కూడా ఎయిర్ కార్గో విజయవంతంగా హ్యాండిల్ చేసింది. మే 1న 1.5 లక్షల మోతాదుల వ్యాక్సిన్లు - ఇది దేశం యొక్క మొట్టమొదటి స్పుత్నిక్ వ్యాక్సిన్లు, మే 16 న 60,000 వ్యాక్సిన్లను హ్యాండిల్ చేసింది. దీనికి అవసరమయ్యే -20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ప్రత్యేక విధానాలు అవసరం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ఒకే అతిపెద్ద కేంద్రంగా మారనుంది. రాబోయే 18-24 నెలల్లో ఇక్కడి నుంచి 3.6 బిలియన్ మోతాదుల వివిధ రకాల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని అంచనా. జనవరి 2021 నుండి, హైదరాబాద్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసిన 100 టన్నులకు పైగా కరోనావ్యాక్సిన్లు రవాణా అయ్యాయి.

ఫార్మా జోన్ గా హైదరాబాద్.. మెరుగైన సేవలందిస్తున్న ఎయిర్ కార్గో..

ఫార్మా జోన్ గా హైదరాబాద్.. మెరుగైన సేవలందిస్తున్న ఎయిర్ కార్గో..

హైదరాబాద్‌లో కరోనా వ్యాక్సిన్లు, కొవిడ్ రిలీఫ్ సామగ్రి పెరుగుతుందని ఊహించిన హైదరాబాద్ విమానాశ్రయం తన ల్యాండ్‌సైడ్, ఎయిర్‌సైడ్ సౌకర్యాలను విస్తరిస్తోంది. వ్యాక్సిన్, టెంపరేచర్ కంట్రోల్డ్ ఔషధాలకు అవసరమైన ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తోంది. దానిలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఫార్మా జోన్‌ను దాదాపు రెట్టింపు చేస్తున్నారు, 15-25 డిగ్రీలు, 2-8 డిగ్రీలు మరియు -20 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ జోన్లను విస్తరిస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం ఫార్మా సరుకులను అన్‌లోడ్ చేసేటప్పుడు ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను నివారించడానికి విస్తరించిన ఫార్మా జోన్‌లో భాగంగా కోల్డ్ సూపర్ స్టోర్ ను కూడా ప్రవేశపెడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+