కొత్త ఆటో కొనుగోలు చేస్తున్నారా..? రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఆటో కొనుగోలుదారులకు శుభవార్త తెలిపింది. పర్మిట్ల గడువును మరో నెల పాటు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ సి. రమేశ్ ఆదేశాలు జారీ చేశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆటోల కొనుగోళ్లకు పర్మిట్లు ఇవ్వడంతో గ్రేటర్ పరిధిలో భారీగా పోటీ నెలకొంది.
హైదరాబాద్ లో కొత్త ఆటో కొనుగోలు చేస్తున్నారా..? అయితే తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆటోల కొనుగోలుకు నెల రోజులపాటు గడువును పొడిగించింది. రెండు దశాబ్దాల తర్వాత పర్మిట్లు ఇవ్వడంతో భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలోనే గడువును మరో నెల పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రవాణాశాఖ సంయుక్త కమిషనర్ సి. రమేశ్ విషయాలను వెల్లడించారు.

తెలంగణ ప్రభుత్వం రెండు నెలల క్రితం ఇచ్చిన జీవో నం.263 ప్రకారం 65 వేల ఎలక్ట్రిక్, ఎల్ పీజీ, సీఎన్ జీ, రెట్రో ఫిట్టింగ్ ఆటోలకు పర్మిట్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. ఇటీవల జీఎస్టీ ధరలు తగ్గిన నేపథ్యంలో మరిన్ని రోజులు పొడిగించాలని రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సంఘాలు కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఆటోల కోసం 19 వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే వాటిలో 18 వేల దరఖాస్తులను అధికారులు మంజూరు చేశారు.
మరోవైపు ఈ నెల 22 నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆటోల ధరలు గణనీయంగా తగ్గాయి. గతంలో 28 శాతం ఉన్న జీఎస్టీ ఇప్పుడు 18 శాతానికి తగ్గిన నేపథ్యంలో.. ఒక్కో ఆటో ధర కనీసం రూ.30 వేల వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications