డ్రగ్స్ సప్లై చేస్తున్న ఆయుర్వేద డాక్టర్ అరెస్ట్: బ్లూడాట్ కొరియర్ ద్వారానే!
హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఆయుర్వేద డాక్టర్ షబీర్ అలీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 53 గ్రాముల ఎండీఎంఏ, 850 గ్రాముల కేటమైన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ షబీర్ అలీ కోల్కతా యూనివర్సిటీలో ఆయుర్వేద కోర్స్ చేసి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అయితే, సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో డ్రగ్స్ దందా మొదలుపెట్టినట్లు చెప్పారు. డ్రగ్స్ కోసం ఇండియా మార్ట్ వెబ్సైట్లో అలీ సెర్చ్ చేసినట్లు గుర్తించారు. బ్లూడాట్ కొరియర్ ద్వారా అలీ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కాకు , శివ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.

డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు అరెస్ట్
మరో ఘటనలో డ్రగ్స్ సప్లై చేస్తున్న నలుగురు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు, 5 సెల్‌ఫోన్లనున్ల స్వా ధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాలప్రకారం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎస్.ముత్తు కుమార్(32), ఎ.సౌందర రాజన్(45)లతో యోగేశ్, మహేశ్వర్లు పరిచయం పెంచుకున్నారు. వీరు డ్రగ్స్‌ను అక్రమంగా వారికి రవాణా చేసేవారు.

దీంతో పాటు నకిలీ కందిపప్పును కూడా పంపిణీ చేసేవారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గత నెల 12న నార్కో టిక్ ఎన్పోర్స్మెంట్ వింగ్ సహాయంతో అమీర్‌పేటలోని అహ్మ ద్ కమర్షియర్షి ల్ కాంప్లెక్స్ వద్ద ముత్తు, సౌందర రాజన్లు కేజీ ఆల్ఫాజోలం మత్తు పదార్థాన్ని విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో భరత్, గంగాధర్ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు చెందిన యోగేశ్, మహేశ్వర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications