కర్ణాటక అమ్మాయిని హైదరాబాద్ ప్రియుడు ఏం చేశాడంటే?, ఫినిష్!
హైదరాబాద్/బెంగళూరు: యువతిని ఆమె కుటుంబ సభ్యులు చదివించారు. చదువు పూర్తి చేసుకున్న యువతి హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లింది. ఉద్యోగం చేస్తున్న యువతికి లోకల్ గా నివాసం ఉంటున్న ఓ యువకుడు పరిచయం అయ్యాడు తరువాత కథ రసవత్తరంగా మారిపోయింది.
కర్ణాటకకు చెందిన యువతిని మోసం చేసి అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో హైదరాబాద్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడిపై కేసు నమోదైంది. నిందితుడిని సికింద్రాబాద్ లోని అల్వాల్‌కు చెందిన మహేంద్ర చారి అలియాస్ మహేంద్రగా గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు.

కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల బాధితురాలు రెండు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి మేడ్చల్‌లోని ఓ హాస్టల్‌లో నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నది. యువతికి, అల్వాల్ కు చెందిన మహేంద్రల మధ్య ఒకరికొకరు పరిచయమయ్యారని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన మహేంద్ర రెండు నెలల క్రితం పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు తమ ముందు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
యువతిని శారీరకంగా లొంగదీసుకుని ఆమెతో కాలం గడిపిన మహేంద్ర గత వారం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని పోలీసులు అన్నారు. తనను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు మహేంద్ర మీద ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోయినపల్లి సబ్‌ఇన్‌స్పెక్టర్ నాగేంద్రబాబు తెలిపారు.
నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపరిచి అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామని, బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు కేసు విచారణలో ఉందని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications