ఎయిర్ పోర్టు నుంచి వస్తుండగా బోల్తా పడిన కారు: సిటీ కాంగ్రెస్ నేత కుమార్తె మృతి
హైదరాబాద్: నగర శివారు శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కాంగ్రెస్ నేత కుమార్తె మృతి చెందింది. వేగంగా వస్తున్న వాహనం అదుపుతప్పడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా(25) మృతి చెందింది. మరో ఇద్దరికి గాయలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తానియా బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నారు.ప్రమాద ఘటనపై ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications