ఐసిస్ ప్లాన్: మంచిర్యాలలో మకాం వేసి.. కేడర్ పెంచే వ్యూహం

Posted By:
Subscribe to Oneindia Telugu

అదిలాబాద్: అదిలాబాద్ జిల్లాలో శనివారం నాడు ఉగ్రవాద కలకలం చెలరేగింది. మంచిర్యాలలో ఉగ్రవాదులు మకాం వేసి కార్యకలాపాలు సాగించారని వార్తలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితం పట్టుబడ్డ ఉగ్రవాది అతావుల్లా ఖాన్ రెహ్మాన్‌ను ఎన్ఐఏ అదికారులు విచారించారు.

దీంతో పలు విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు మంచిర్యాలలో మాకం వేసిన ఐసిస్ సానుభూతిపరులు.. పలువురిని తమలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారని విచారణలో రెహ్మాన్ తెలిపాడు.

మంచిర్యాలలో మకాం వేసి మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో తమ కేడర్ పెంచుకోవాలని ఐసిస్ సానుభూతిపరులు భావించినట్లుగా విచారణలో తేలింది. మంచిర్యాల, మందమర్రి ప్రాంతాల్లో గతంలోను ఉగ్రవాద జాడ వెలుగు చూసింది. 2002లో ఉగ్రవాది అజం ఘోరి ఇక్కడే ఉండి, ఆ తర్వాత కరీంనగర్ మకాం మార్చినట్లు పోలీసులు గుర్తించారు. అతను ఎన్‌కౌంటర్లో హతమయ్యాడు.

 ఐసిస్

ఐసిస్

హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన ఐసిస్ సానుభూతిపరుల జ్యూడిషియల్ కస్టడీని నాంపల్లి న్యాయస్థానం జూలై 26వ తేదీ వరకు పొడిగించింది.

 ఐసిస్

ఐసిస్

గత నెల హైదరాబాదులోని పాతబస్తీలో సోదాలు నిర్వహించిన జాతీయ దర్యాఫ్తు సంస్థ ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను, ఆ తర్వాత మరో ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 ఐసిస్

ఐసిస్

వారిని జాతీయ దర్యాఫ్తు సంస్థ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. పలు షాకింగ్ విషయాలు ఈ విచారణలో వెల్లడయ్యాయి. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత మరొకరిని అదుపులోకి తీసుకొని విచారించి, శనివారం అతనిని కోర్టు ఎదుట హాజరుపరిచారు.

 ఐసిస్

ఐసిస్

సోదాల సమయంలో ఎన్ఐఏ అదికారులు పేలుడు పదార్థాలు, రెండు సెమీ ఆటోమేటిక్ పిస్టోల్స్ తదితరాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Nampally Court in Hyderabad on Saturday sent one of the Islamic State terror suspects arrested by the National Investigation Agency (NIA) to judicial custody till July 26.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి