Birdflu: ఫ్రీగా చికెన్ ఐటమ్స్.. ఎగబడిన జనం!
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు చికెన్ వ్యాపారులు ఫ్రీ ఫుడ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్ హయత్‌నగర్‌లోని వెన్‌కాబ్ వెంకటేశ్వరా హేచరీస్, జ్యోతి చికెన్ సెంటర్ నిర్వాహకులు మహేశ్ ఆధ్వర్యంలో కుంట్లూరు మెయిర్ రోడ్‌లో ఆదివారం మెగా చికెన్ మేళా నిర్వహించారు. ఉచితం అని ప్రకటించడంతో జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ, చిల్లీ చికెన్, బాయిల్డ్ ఎగ్స్ తో ఫెస్ట్ ఏర్పాటు చేసి ఉచితంగా అన్ని ఐటమ్స్ అందించడంతో జనం భారీ సంఖ్యలో ఎగబడ్డారు. ఫ్రీగా అందిస్తున్న చికెన్ ఐటమ్స్ ను కడుపారా ఆరగించారు ఆహార ప్రియులు. తాము చేపట్టిన కార్యక్రమానికి అంచనాలకు మించి స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

బర్డ్ ఫ్లూపై ఉన్న అపోహలను నమ్మవద్దని నిర్వాహకులు ప్రజలకు స్పష్టం చేశారు. చికెన్ వండే సమయంలో బాగా ఉడికించి తింటే ఎలాంటి వ్యాధులూ రావని తెలిపారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకే ఈ చికెన్ ఫెస్ట్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
మరోవైపు, 70 డిగ్రీల సెల్సియస్ వేడిలో చికెన్ ు బాగా ఉడికించి తింటే ఎలాంటి సమస్యా ఉండదని సంబంధిత అధికారులు కూడా చెబుతున్నారు. ఉడికీ ఉడకని చికెన్, గుడ్లు తింటేనే బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందని అంటున్నారు. బర్డ్ ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకదని.. పక్షులు, జంతువుల నుంచి మాత్రమే మనుషులకు సోకుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications