హైదరాబాద్ లో ఘోరం.. డ్రైనేజిలో పడి ముగ్గురు కొట్టుకుపోయి..
హైదరాబాద్ లో ఇవాళ సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే భాగ్యనగరంలో భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. వర్షం ధాటికి ఆసిఫ్ నగర్ అఫ్జల్ సాగర్ లోని మంగారు బస్తీలో ఇద్దరు గల్లంతు అయ్యారు. నాలాలో పడి మామ, అల్లుడు కొట్టుకుపోయారు. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా గల్లంతైనట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, హైడ్రా సిబ్బంది.. కొట్టుకుపోయిన మామ, అల్లుడు కోసం గాలిస్తున్నారు. అటూ ముషీరాబాద్ లోనూ ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలోనే దాదాపు 12 సెం. మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా ఆసిఫ్ నగర్ అఫ్జల్ సాగర్ లోని మంగారు బస్తీలో ఇద్దరు గల్లంతు అయ్యారు. నాలాలో పడి మామ, అల్లుడు కొట్టుకుపోయారు. అటూ ముషీరాబాద్ లోనూ ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.
ఇక గచ్చిబౌలి పరిధిలోని వట్టినాగులపల్లిలో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. భారీ వర్షానికి ఓ ఇంటి గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో పురాతన ఇళ్లలో ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లు, కాలనీలు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరాయి.

నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్, గచ్చిబౌలి, హిమాయత్‌నగర్, వనస్థలిపురం, బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, నారపల్లి, బషీర్ బాగ్, బేగం బజార్, ఎల్బీనగర్, హయత్ నగర్, అబ్దుల్లా పూర్ మెట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, ముషీరాబాద్, రామ్ నగర్, తార్నాక, కాచిగూడ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.












Click it and Unblock the Notifications