హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

24 గంటల్లోనే కోలుకున్నారు: 40 మంది కరోనా బాధితులకు యాంటీబాడీ కాక్‌టెయిల్ ట్రీట్మెంట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా చికిత్సలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ డ్రగ్ మెరుగైన ఫలితాలిస్తోందని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో 40 మంది కరోనా బాధితులకు ఇటీవల కాక్‌టెయిల్ డ్రగ్ ఇచ్చినట్లు ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.

24 గంటల్లోనే కోలుకున్నారు..

24 గంటల్లోనే కోలుకున్నారు..

డ్రగ్ ఇచ్చిన కేవలం 24 గంటల సమయంలోనే బాధితులంతా జ్వరం సహా ఇతర అనారోగ్య లక్షణాల నుంచి కోలుకున్నట్లు డాక్టర్ వెల్లడించారు. అంతేగాక, కొద్ది రోజుల్లోనే వైకరస్ పూర్తిగా అంతమైనట్లు తెలిపారు. ఈ కాక్ టెయిల్ డ్రగ్ బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు అమెరికాలో జరిపిన అధ్యయనంలో తేలిందన్నారు.

కొద్ది రోజుల్లోనే కరోనా ఖతం..

కొద్ది రోజుల్లోనే కరోనా ఖతం..

భారత్‌లో తొలిసారి వెలుగుచూసిన డెల్టా వేరియంట్లపై ఈ డ్రగ్ ఏమేర పనిచేస్తుందన్న దానిపై ఇంకా ఎవరూ అధ్యయనం చేయలేదన్నారు. ఏఐజీలో బాధితులకు ఈ కాక్ టెయిల్‌తో చికిత్స అందిస్తూనే సమాంతరంగా డెల్టా వేరియంట్‌పై పనిచేస్తుందో? లేదో అనేదానిపై అధ్యయనం కూడా చేస్తున్నామని తెలిపారు. ఈ కాక్ టెయిల్ డ్రగ్ తీసుకున్న 40 మంది బాధితులు ఆరోగ్య పరిస్థితి వారం తర్వాత సమగ్రంగా విశ్లేషించామని, వీరిలో 100 శాతం కరోనావైరస్ కనుమరుగైనట్లు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తేలిందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

కాక్‌టెయిల్ అతిగా వాడొద్దు.. వీరికి ప్రయోజనమే..

కాక్‌టెయిల్ అతిగా వాడొద్దు.. వీరికి ప్రయోజనమే..

అయితే, ఈ కాక్ టెయిల్ డ్రగ్‌ను బాధితులకు ఎక్కువ మోతాదులో వాడకూడదన్నారు. అతిగా వాడటం వల్ల కొత్త వేరియంట్లు కూడా పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ నాగేశ్వర్ హెచ్చరించారు. కరోనా సోకిన తర్వాత హైకోమార్పిడ్ కండిషన్లో ఉన్న 65ఏళ్లపైబడినవారు, స్తూలకాయులు, టైప్-2 డయాబెటీస్, కిడ్నీ వ్యాధులు, రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న పేషెంట్లలో 30 శాతం వరకు సీరియస్ అవుతున్నారని.. వీరిలో మరణాలు కూడా ఎక్కువ ఉంటున్నాయని.. ఇలాంటి వారిని ఈ కాక్ టెయిల్ డ్రగ్ ఆదుకుంటుందని ఆయన తెలిపారు. ఇది కరోనా చికిత్సలో గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు.

అసలీ కాక్‌టెయిల్ డ్రగ్ అంటే...

అసలీ కాక్‌టెయిల్ డ్రగ్ అంటే...

కాగా, ఈ కాక్ టెయిల్ డ్రగ్ ఏమిటంటే.. కసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ ఔషధాలను కలిపి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్ టెయిల్‌గా రూపొందించారు. కరోనా స్పైక్ ప్రోటీన్, దాని అటాచ్‌మెంట్ మానవ కణాల్లోకి ప్రవేశించకుండా ఈ మందు అడ్డుకుంటుంది. వివిధ వేరియంట్లపై ఇది సమర్థంగా పనిచేస్తోందన్నారు. పేషెంట్లు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి తక్కువగా ఉందని, మరణాలు 70 శాతం తగ్గుతున్నాయని వైద్యులు తేల్చారు. కరోనా పాజిటివ్ అని తేలగానే ఈ ఔషధం తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. కాగా, ఏఐజీతోపాటు యశోదా ఆస్పత్రిలోనూ ఈ కాక్ టెయిల్ డ్రగ్ వినియోగిస్తున్నారు.

English summary
Asian Institute of Gastroenterology(Hyderabad) doctor on antibody cocktail treatment given to 40 patients, cured in 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X