హైదరాబాద్ లో డ్రగ్స్ ఫ్యాక్టరీపై దాడి.. రూ. 12 వేల కోట్ల మాదకద్రవ్యాలు స్వాధీనం
హైదరాబాద్ మహానగరం డ్రగ్స్ కు అడ్డాగా మారిపోతుంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా నగరంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు అయింది. రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నగరంలోని మేడ్చల్ కేంద్రంగా నిషేధిత పదార్ధాలను తయారు చేస్తున్న ముఠాను తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు పట్టుకున్నారు. డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహించారు. రూ. 12 వేల కోట్ల రూపాయల విలువైన మూడు రకాల నిషేధిత మాదకద్రవ్యాలను సీజ్ చేశారు. వీటిలో అత్యంత ప్రమాదకరమైన ఎక్స్ టీసీ (XTC), మోలీ, MDMA లాంటి మాదకద్రవ్యాలు లభించినట్లు అధికారులు తెలిపారు.

అత్యంత ప్రమాదకరమైన నిషేధిత పదార్థాలతో పాటు దాదాపు 32,000 లీటర్ల రా మెటీరియల్ ను కూడా సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో భాగంగా డ్రగ్స్ తయారీలో నిమగ్నమైన 13 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో తయారు చేస్తున్న ఈ డ్రగ్స్ ను దేశ విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ తనిఖీలను నిర్వహించింది.












Click it and Unblock the Notifications