దారుణం: మటన్‌కర్రీ రుచిగా వండలేదని కిరోసిన్ పోసి భార్యకు నిప్పు

హైదరాబాద్: మటన్‌కర్రీని రుచిగా వండలేదని మద్యం మత్తులో ఉన్న ఓ తాగుబోతు భార్యపై కిరోసిన పోసి నిప్పంటించిన ఘటన మైలార్‌దేవ్‌పల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పద్మశాలిపురం టీఎన్జీవోఎస్‌కాలనీలో సులోచన(25), శంకర్‌రావు షిండే దంపతులు నివాసం ఉంటున్నారు.

వీరికి సంతోష(8) అనే ఒక కుమార్తె ఉంది. శంకర్‌రావు హమాలీగా పని చేస్తున్నాడు. ఈనెల 20వ తేదీన శంకర్‌రావు మటన్ తెచ్చి భార్యకు ఇచ్చి కూర వండమన్నాడు. అనంతరం బయటకు వెళ్లి మద్యం తాగి వచ్చిన అతను మటన్‌కర్రీని రుచి చూశాడు.

Drunk man kills wife for not cooking mutton curry

దీంతో మటన్‌కర్రీని రుచిగా వండలేదని భార్యపై గొడవకు దిగాడు. ఈ క్రమంలో పుల్లుగా మద్యం తాగి ఉన్న అతడు తీవ్ర ఆగ్రహాంతో ఊగిపోతూ భార్య సులోచనపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం పరారయ్యాడు. స్థానికులు వెంటనే మంటలను ఆర్పి సులోచనను 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలు చికిత్సపొందుతూ ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శంకర్‌రావు షిండేను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలు పాలుకావడంతో వారి కుమార్తె సంతోష అనాథగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+