Hyderabadలో ఒక్కరోజే 4 హత్యలు, నడిరోడ్డుపై కత్తులో పొడుచుకున్న రౌడీషీటర్లు
హైదరాబాద్: నగరంలో జరిగిన వరుస హత్యలు కలకలం సృష్టించాయి. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాహుల్ అనే వ్యక్తిని అతడి స్నేహితుడే దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మరో ఘటనలో ఓ యువకుడ్ని దుండగులు హత్య చేశారు. ఈ ఘటన రెయిన్ బజార్‌లో చోటు చేసుకుంది.
ఇది ఇలావుండగా, మెహదీపట్నం లంగర్‌హౌస్‌లో ఇద్దరు రౌడీ షీటర్లు పరస్పరం దాడులు చేసుకుని హతమయ్యారు. శుక్రవారం రాత్రి ఆలివ్ ఆస్పత్రి సమీపంలో చాంద్ మహ్మద్(షేక్ మహ్మద్), అబూ(ఫైజుద్దీన్) అనే ఇద్దరు రౌడీ షీటర్లు నడిరోడ్డుపై కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు.

ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన చాంద్, అబూలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video
పాత కక్షలతోనే ఇద్దరు ఘర్షణకు దిగి చనిపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని జాయింట్ కమిషనర్ ఆఫ్ కమిషనర్(వెస్ట్) ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఓ గ్రూపు బైక్స్ పై వెళుతుండగా మరో గ్రూపు ఎస్ యూవీ వాహనంలో వెళుతూ వారిని ఢీకొట్టడంతో ఘర్షణ మొదలైందని తెలిసిందని చెప్పారు.












Click it and Unblock the Notifications