సంచలన నిర్ణయం: హైదరాబాద్‌లో ఇక పార్కింగ్ ఫ్రీ!

Subscribe to Oneindia Telugu
  హైదరాబాద్‌లో ఇక పార్కింగ్ ఫ్రీ! New ‘parking policy’ In Telangana | Oneindia Telugu

  హైదరాబాద్: నగరంలోని వాహనదారులకు ఇది ఖచ్చితంగా తీపి కబురే. ఎందుకంటే.. వాహనదారులు మాల్స్, థియేటర్స్‌కి వెళ్లినప్పుడు, లేదా వాణిజ్యసముదాయాల వద్ద పార్కింగ్ చేసినా పార్కింగ్ రుసుంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, దీనికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

  ఇక ఫ్రీ పార్కింగ్...

  ఇక ఫ్రీ పార్కింగ్...

  ఇకపై హైదరాబాద్‌లో ఎక్కడైనా(షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, హోటళ్లు, రెస్టారెంట్స్, ఫంక్షన్ హాల్స్, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు) ఉచితంగా పార్కింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించనుంది. సోమవారం పురపాలక మంత్రి కె.తారకరామారావు సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

  ఫీజులు వసూలు చేయరాదు..

  ఫీజులు వసూలు చేయరాదు..

  మాల్స్, థియేటర్లు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, కళ్యాణ మండపాలు, పరిశ్రమల భవనాల్లో ఉచిత పార్కింగ్‌ను తప్పనిసరి చేయనున్నారు. అలాగే వాటిలో పార్కింగ్‌కు ఎలాంటి ఫీజు వసూలు చేయరాదని నిర్ణయించారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

  పెద్ద ఎత్తున నిరసనలు

  పెద్ద ఎత్తున నిరసనలు

  ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పార్కింగ్‌ దందాపై వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. షాపింగ్ మాల్స్, థియేటర్స్ యాజమాన్యాలు ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాల నుంచి భారీ(రూ.20-100)గా పార్కింగ్ రుసుం వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దోపిడీపై కొందరు పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజా నిర్ణయం తీసున్నట్లు తెలుస్తోంది.

  నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా..

  నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా..

  ఆయా వాణిజ్య సంస్థల్లో కొనుగోళ్లకు వెళ్లిన వారికే ఈ ఉచిత సదుపాయం కల్పించనున్నారు. సినిమా థియేటర్లకు వెళ్లే వారు పార్కింగ్ ఫీజు చెల్లించకుండా సినిమా టికెట్‌ను చూపిస్తే సరిపోతుంది. ఈ విధానాన్ని నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో అమలు చేయనున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Greater Hyderabad Municipal Corporation (GHMC) set the ball rolling for the new parking policy.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి