హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశంలో వచ్చిన ఐటీ ఉద్యోగాల్లో హైదరాబాద్ వాటా 1/3: ఐటీ వృద్ధీపై కేటీఆర్ ఏమన్నారంటే..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత 8 ఏళ్లలో హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా కాలంలోనూ ఐటీ పరిశ్రమ వృద్ధి సాధించిందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 2021-22 ఏడాదికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు.ఐటీలో 8 ఏళ్లుగా తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణలో 4 లక్షలకుపైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్న కేటీఆర్

తెలంగాణలో 4 లక్షలకుపైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్న కేటీఆర్

రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో 4 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గతేడాదిలోనే లక్షన్నర ఉద్యోగాలు హైదరాబాద్‌లో వచ్చాయని మంత్రి తెలిపారు. కరోనా ఉన్నా కూడా హైదరాబాద్‌ నుంచి ఐటీ ఎగుమతులు పెరిగాయని పేర్కొన్నారు.కరోనా ఉన్నా గతేడాది అంచనాలకు మించి రాణించామని తెలిపారు. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ సాధించామని వెల్లడించారు.

గత 8ఏళ్లలో తెలంగాణలో ఐటీ అద్భుత పురోగతి: కేటీఆర్

గత 8ఏళ్లలో తెలంగాణలో ఐటీ అద్భుత పురోగతి: కేటీఆర్

గత సంవత్సరం దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తే.. ఒక్క హైదరాబాద్‌లోనే లక్షన్నర వచ్చాయని తెలిపారు. ఐటీలో 8 ఏళ్లుగా అద్భుతమైన పురోగతి సాధించామన్నారు. కరోనా ఉన్నా గతేడాది అంచనాలకు మించి రాణించినట్లు తెలిపారు. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14 శాతం వృద్ధి సాధించాం. జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ సాధించామన్నారు. ఏడాదిలో లక్షన్నర ఉద్యోగాలు హైదరాబాద్‌లో వచ్చాయి. హైదరాబాద్‌ నుంచి ఐటీ ఎగుమతులు పెరిగాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.

హైదరాబాద్‌లో వన్ ప్లస్ టీవీల తయారీ..జూన్ 20న టీహబ్ రెండో దశ


వన్‌ ప్లస్‌ కంపెనీ హైదరాబాద్‌లో టీవీలు తయారుచేస్తోందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121కు చేరిందని తెలిపారు. జూన్ 20న టీహబ్ రెండో దశ ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. టీ వర్క్స్ కొత్త ఫెసిలిటీ ఆగస్టులో ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. కాగా, ఇటీవల దావోస్ పర్యటనలో కూడా పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

English summary
Hyderabad generated one-third of country’s IT jobs in 2021-22, says telangana minister KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X