హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్‌లో భారీ వర్షం: నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ జామ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది.ఈదురుగాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

శుక్రవారం రాత్రి ఒక్కసారిగా హైద్రాబాద్ నగరంలో వాతావరణం చల్లబడింది. పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. దీంతో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

Hyderabad: Heavy rains and hailstorm cause traffic jams, power outage

మాదాపూర్‌, గచ్చిబౌలి, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌, మోండా మార్కెట్‌, బేగంపేట, రసూల్‌పురా, మారెడ్‌పల్లి, తుకారంగేట్‌, అడ్డగుట్ట, చిలకలగూడ, కార్ఖాన, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్‌ చంపాపేట్‌, సైదాబాద్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, సంతోష్‌నగర్‌, బషీర్‌బాగ్‌, అబిడ్స్‌, లక్డీకాపూల్‌, సుల్తాన్‌బజార్‌, నాంపల్లి, మేడ్చల్‌జిల్లా మల్కాజ్‌గిరి, నేరెడ్‌మెట్‌, కుషాయిగూడ, ఈసీఐఎల్‌, నాచారం, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, ఉప్పల్‌, రామంతాపూర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

చిలకలగూడలో రహదారిపై భారీ వృక్షం నేలకొరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది.తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

క్యూమిలోనింబస్‌ మేఘాల ప్రభావంతో వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం ప్రకటించింది. ఈ మేఘాల ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కరిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని కొన్ని ప్రాంతాల్లో మరింత ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

English summary
Heavy rainfall accompanied with hail and thunderstorm lashed several parts of the city, including Begumpet, Banjara Hills, Srinagar Colony, Ameerpet among others, on Friday sending the city into a cooldown mode with temperatures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X