Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెల్లి ఆశ్రిన్ పెళ్లి నచ్చకే.. నాగరాజును హత్య చేసిన సోదరుడు: నిందితుల అరెస్ట్‌పై డీసీపీ

హైదరాబాద్: సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నాగరాజు హత్యకేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎల్బీ నగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వెల్లడించారు. ప్రధాన నిందితుడు మోబిన్ అహ్మద్, ఏ2 మసూద్ అహ్మద్‌లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వారిద్దరు కలిసి చంపినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో గుర్తించామని డీసీపీ వెల్లడించారు.

చెల్లి ప్రేమ పెళ్లి ఇష్టం లేకే నాగరాజును హత్య చేశాడు: డీసీపీ

చెల్లి ప్రేమ పెళ్లి ఇష్టం లేకే నాగరాజును హత్య చేశాడు: డీసీపీ

మృతుడు నాగరాజు వికారాబాద్ జిల్లా స్టేషన్‌ మర్పల్లి వాసిగా గుర్తించినట్లు డీసీపీ పేర్కొన్నారు. కేసు సున్నితత్వం దృష్ట్యా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ట్రయల్ చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామని డీసీపీ స్పష్టం తెలిపారు. బాల్య స్నేహితులైన నాగరాజు, ఆశ్రిన్ సుల్తానా ప్రేమించుకున్నారు. నాగరాజు, సుల్తానా జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. చెల్లిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో నాగరాజును చంపాడని డీసీపీ వెల్లడించారు. నాగరాజు, సుల్తానా ప్రేమ పెళ్లి సుల్తానా కుటుంబీకులకు నచ్చలేదు. సయ్యద్‌ మోబిన్‌ నెల రోజులుగా నాగరాజు కోసం వెతికాడు. మలక్‌పేటలో నాగరాజు పనిచేస్తున్న కార్ల షోరూం వద్దకు మోబిన్ వెళ్లాడు. రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో వెంబడించి నాగరాజును చంపాడు. సుల్తానాను పక్కకు తోసి నాగరాజు తలపై సెంట్రింగ్ రాడ్డుతో దాడి చేసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందాడు. సుల్తానా అన్న మోబిన్‌, బంధువు మసూద్‌తో కలిసి నాగరాజును చంపాడు. నిందితులకు త్వరలోనే శిక్ష పడేలా చేస్తామని డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.

జనవరిలోనే పెళ్లి చేసుకున్న నాగరాజు-ఆశ్రిన్

జనవరిలోనే పెళ్లి చేసుకున్న నాగరాజు-ఆశ్రిన్

రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా.. ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఆశ్రిన్ కుటుంబసభ్యులు అతడిని హెచ్చరించారు. అయితే, ఆశ్రిన్‌ను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న నాగరాజు.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కార్ల కంపెనీలో కొద్ది నెలల కిందట సేల్స్‌మన్‌గా చేరాడు. జనవరిలో ఆశ్రిన్‌ను కలుసుకున్న నాగరాజు కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకుందామని చెప్పాడు.
ఈ క్రమంలో జనవరి చివరి వారంలో ఆశ్రిన్ పారిపోయి హైదరాబాద్ వచ్చింది.
లాల్‌దర్వాజలోని ఆర్యసమాజ్‌లో జనవరి 31న ఆశ్రిన్, నాగరాజు వివాహం చేసుకున్నారు.

నాగరాజు దంపతుల కదలికలపై కన్నేసి.. దారుణానికి తెగబడ్డారు

నాగరాజు దంపతుల కదలికలపై కన్నేసి.. దారుణానికి తెగబడ్డారు

ఆ తర్వాత తనను గుర్తించకుండా నాగరాజు వేరే ఉద్యోగంలో చేరాడు. అయితే హైదరాబాద్‌లో ఉంటున్నట్లు ఆశ్రిన్ కుటుంబసభ్యులు గుర్తించడంతో ఈ కొత్త జంట కొన్ని రోజులు విశాఖపట్నంకు వెళ్లారు. ఎవరూ తమను వెతకడం లేదని భావించి.. మళ్లీ ఐదు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. సరూర్‌నగర్‌లోని పంజా అనిల్ కుమార్ కాలనీలో నివసిస్తున్నారు. మళ్లీ హైదరాబాద్ వచ్చారనే విషయం తెలిసిన ఆశ్రిన్ కుటుంబసభ్యులు ఈ జంట కదలికలను గమనించారు. బుధవారం రాత్రి నాగరాజు, ఆశ్రిన్‌లు కాలనీలోంచి ద్విచక్ర వాహణంపై బయటకు రాగానే ఆశ్రిన్ సోదరుడు, అతడి స్నేహితుడు బైక్‌పై వారిని వెంబడించి దాడికి పాల్పడ్డారు. ఇనుపరాడ్లతో తీవ్రంగా కొట్టి హతమార్చారు.

కనికరించని హంతకులు.. భర్త మృతితో తల్లడిల్లిపోయిన ఆశ్రిన్

కనికరించని హంతకులు.. భర్త మృతితో తల్లడిల్లిపోయిన ఆశ్రిన్

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యపై సాక్ష్యాధారాలు సేకరించామని ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. కళ్ల ఎదుటే భర్త చనిపోవడంతో ఆశ్రిన్ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమెను నాగరాజు బంధువులు అక్కడ్నుంచి తీసుకెళ్లారు. తన భర్తను కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆశ్రిన్ కన్నీటిపర్యంతమైంది. తన భర్తపై దాడి చేస్తుండగా అడ్డువెళ్లానని.. ఎంత వేడుకున్నా.. తనను తోసేసి తన సోదరుడు, మరికొందరు నాగరాజుపై ఇనుపరాడ్లతో కొట్టి చంపారని తెలిపింది. అక్కడున్నవారందరిని తన భర్తను కాపాడాలని కోరినా ఎవరూ ముందుకు రాలేదని పేర్కొంది. తన భర్తను చంపినవారిని శిక్షించి, తనకు న్యాయం చేయాలని ఆశ్రిన్ కోరింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+