హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యను వ్యభిచారం చేయాలని ఒత్తిడి, కట్నం కోసం తప్పదన్న అత్త, భార్య ఇలా....

భార్యను బలవంతంగా వ్యభించారంలోకి దింపేందుకు ప్రయత్నించిన ఓ భర్తను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు వేధింపులకు గురిచేసేవారు. ఈ వేధింపులకు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:భార్యను బలవంతంగా వ్యభిచారంలోకి దింపేందుకు ప్రయత్నించిన ఓ భర్తను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు కట్నం తీసుకురావాలని బాధితురాలిని అత్త వేధించేదని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఫహీమ్ ఫాతిమా ను మహ్మద్ యూసుఫ్ అలియాస్ సద్దాం 2015 లో వివాహం చేసుకొన్నాడు.అయితే మహ్మద్ యూసుప్ అలియాస్ సద్దాం హిందూమతానికి చెందిన వారని బాధితురాలు ఫహీమ్ ఫాతిమా చెబుతోంది..అయితే తమ వివాహనికి స్థానికంగా ఉన్న జహంగీర్, జావీద్ అనే వ్యక్తులు సహకరించారని ఆమె చెప్పారు.

HYDERABAD: HUSBAND FORCING HIS WIFE FOR PROSTITUTION ARRESTED

ఫహీమ్ ఫాతిమాను వివాహం చేసుకొన్న తర్వాత సద్దాం తన మకాన్ని ముంబాయికి మార్చాడు. మహ్మాద్ యూసుఫ్ లో ఫహీష్ ఫాతిమాతో వ్యభిచారం చేయించాలని సద్దాం బలవంత పెట్టాడు. ఆమె అత్తింటివారు కూడ ఆమెను కట్నం కోసం వేధించేవారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.

దీంతో ఆమె ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు తన తల్లిదండ్రుల సహయంతో హైద్రాబాద్ కు తిరిగి వచ్చింది. అంతేకాదు హైద్రాబాద్ మాదన్నపేట పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోలేదు.

ఆమె ఎంబిటి అధికార ప్రతినిధి మహ్మద్ అంజతుల్లా ఖాన్ ను కలిసి తన బాధను వివరించింది.అయితే ఆయన సహకారంతో ఆమె సౌత్ జోన్ డిసిపి సత్యనారాయణను కలిసింది. దీంతో పోలీసులు మహ్మద్ యూసుప్ అలియాస్ సద్దాం, ఆయన తల్లి రహమత్ బేగం ను నాంపల్లి రైల్వే స్టేషన్ లో అరెస్టు చేశారు. వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

English summary
Husband who hails from Mumbai was forcing his wife, a resident of Madannapet, Hyderabad for prostitution was arrested at Nampally Railway Station.According to the details, Farheen Fatima (19) got married to a native of Mumbai, Mohammed Yousuf alias Saddam in 2015. It is said that her husband and in-laws belong to Hindu community. This fact was suppressed at the time of marriage. The local residents, Anwar Jahangir and Javeed helped in marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X