హైదరాబాద్: మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాంసన్ పెయింట్ పరిశ్రమలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు.
రామ్సన్ గోదాం పక్కకు ఆనుకొని ఉన్న తిరుమల వుడ్ కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వినాయక చవితి సెలవు దినం కావడంతో ఆ పరిశ్రమలో కార్మికులు ఎవరూ లేరు. దీంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.

పండగపూట విషాదం: విద్యుత్ షాక్ ఇద్దరు మృతి
వినాయక చవితి వేడుకల వేళ విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా.. మహేశ్(13) అనే బాలుడు విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. స్థానిక టీవీఎస్ షోరూం వెనుక వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దూలపల్లిలో వినాయక మండపం వద్ద యువకుడు మృతి చెందాడు. మండలం ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ ఘాతంతో నవీన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications