రైలు టాయిలెట్లో ఉరేసుకుని కూలీ ఆత్మహత్య
హైదరాబాద్: ఓ రైల్వే కూలీ రైలులోని టాయిలెట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుడిని కర్నూలు జిల్లాకు చెందిన 48 ఏళ్ల సునపగళ్ల వెంకటరాములు గుర్తించారు.
గురువారంనాడు వెంకట్రాములు తిరుపతికి చెందిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కంపార్టుమెంటులోకి హైదరాబాదులోని కాచిగుడాలో ఎక్కాడు. కాచిగుడా నుంచి రైలు బయలుదేరడానికి కొంచెం ముందుగా అతను కోచ్‌లోని టాయిలెట్లోకి వెళ్లి తెల్లటి వస్త్రంతో ఉరేసుకున్నాడు.

కాచిగుడాలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లను తనిఖీ చేస్తున్న పిట్ లైన్ స్టాఫ్ అతను ఉరేసుకున్న విషయాన్ని గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంకట్రాములు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియడం లేదు.












Click it and Unblock the Notifications