హైదరాబాదీయులకు ఉగాది కానుక

Hyderabad Metro Rail: నేడు శ్రీ క్రోధి నామ ఉగాది పండగ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైభవోపేతంగా ఈ పర్వదినాన్ని జరుపుకొంటోన్నారు. తెల్లవారు జాము నుంచి ఆలయాన్నీ సందడిగా మారాయి. భక్తుల రద్దీ నెలకొంది. దాదాపు అన్ని ఆలయాల్లోనూ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు శుభవార్త వినిపించారు ప్రయాణికులకు. ప్రయాణికుల నుంచి అత్యంత ఆదరణ పొందిన మూడు ప్రయాణ రాయితీ కార్డులను పొడిగించినట్లు వెల్లడించారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

Hyderabad Metro Rail extends these schemes for the next Six 6 months

సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్- పీక్ హవర్ ఆఫర్‌ కార్డులను ఆరు నెలల పాటు అంటే- సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. అనంతరం అప్పటి పరిస్థితుల ఆధారంగా మరోసారి వాటి కాలపరిమితిని పొడిగించాలా? వద్దా? అనే విషయంపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు.

నిజానికి- ఈ కార్డుల కాలపరిమితి ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిపోయింది. అధికారులు వాటిని వెంటనే పొడిగించలేదు. ప్రయాణికుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

1. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు: ఈ కార్డును కొనుగోలు చేయడం ద్వారా ఒకరోజంతా మెట్రో రైలులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణం చేయవచ్చు. దీని ధర 100 రూపాయలు. రీఛార్జ్ చేయడానికి అదనంగా 59 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.

2. మెట్రో స్టూడెంట్ పాస్: విద్యార్థుల కోసం ఉద్దేశించిన కార్డు ఇది. 20 ట్రిప్పులకు ఛార్జీని చెల్లించి.. 30 ట్రిప్పుల వరకు వారు రాకపోకలు సాగించవచ్చు. 30 ట్రిప్పుల మేర రాకపోకలు ఉచితంగా లభించినట్టవుతుంది.

3. సూపర్ ఆఫ్- పీక్ హవర్ ఆఫర్‌: ప్రయాణ ఛార్జీలో 10 శాతం రాయితీని కల్పించే పథకం ఇది. మెట్రో రైలులో మామూలు సమయాల్లో వసూలు చేసే ఛార్జీపై ఆఫ్ పీక్‌లో అంటే రద్దీ లేని సమయాల్లో 10 శాతం రాయితీ ఇస్తారు. స్మార్ట్ కార్డులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 10 శాతం ప్రయాణించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+