Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రయాణికులకు షాకిచ్చిన మెట్రో రైలు!

హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు గురువారం తీవ్ర అంతరాయం నెలకొంది. సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 20 నిమిషాలపాటు అంతరాయం కలిగింది. దీంతో మెట్రో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు రైలు సేవల్లో అంతరాయం కలిగింది.

మియాపూర్ నుంచి ఎల్బీనగర్ రూట్లో.. భరత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద దాదాపు 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ఆ మార్గంలోని ప్రతి మెట్రో స్టేషన్లో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఎంతసేపటికీ కదలకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad Metro Rail services disrupted due to technical glitch

కొందరు ప్రయాణికులు మెట్రో స్టేషన్ల నుంచి బయటికి వచ్చి ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు బయల్దేరారు. సాంకేతిక కారణాలతోనే రైలు సేవలకు అంతరాయం కలిగిందని మెట్రో యాజమాన్యం వెల్లడించింది. టెక్నికల్ ఇష్యూను సరి చేయడానికి తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు తెలిపింది. కాగా, మే 1వ తేదీన ప్రభుత్వ సెలవు దినం కావడంతోరైళ్లలో రద్దీ కాస్త తక్కువగా ఉంది.

ఏప్రిల్ 2న కూడా మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్య కారణంగా నాంపల్లిలో దాదాపు పావుగంటకుపైగా రైలు నిలిచిపోయింది. ఆ తర్వాత స్పందించిన మెట్రో సిబ్బంది వెంటనే సమస్యను పరిష్కరించడంతో రైలు సేవలు యథావిధిగా కొనసాగాయి.

మరోవైపు, హైదరాబాద్ మెట్రో యాజమాన్యం రైలు ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో టికెట్ ఛార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని మెట్రో స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రయాణికులకు ఇస్తున్న పలు రాయితీలను తొలగించిన విషయం తెలిసిందే. ఇక, త్వరలోనే మెట్రో ఛార్జీలు కూడా పెంచేందుకు సిద్ధమైంది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడే అకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+