పాతబస్తీలో దారుణం: లలిత్‌బాగ్ కార్పొరేటర్ అల్లుడిని కత్తులతో పొడిచి చంపారు
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అంతా చూస్తుండగానే.. లలితాబాగ్ ఎంఐఎం కార్పొరేటర్ కార్యాలయంలో వ్యక్తి హత్య జరిగింది. లలిత్‌బాగ్ ఎంఐఎం కార్పొరేటర్ ఆజం షరీఫ్ అల్లుడు ముర్తుజా అనస్‌పై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన అనస్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు.
పదుల సంఖ్యలో తరలివచ్చిన కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కత్తులతో కార్యాలయంలోకి చొరబడ్డ దుండగులు.. కార్పొరేటర్ అల్లుడు అనస్ పై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. కత్తులు, కర్రలతో తీవ్రంగా దాడి చేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. చనిపోయాడని భావించిన నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు.

అయితే దాడికి గల కారణాలు మాత్రం తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. హత్య ఎలా జరిగింది..? హత్య చేసింది ఎవరు..? ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, హుటాహుటిన అనస్ ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడిన అనస్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. హత్యకు సంబంధించిన వార్త తెలియడంతో ఘటనా స్థలం వద్దకు భారీగా ఎంఐఎం కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆరుగురు కలిసి అనస్ పై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో అనస్ ఇంటర్ చదువుతున్నాడు. స్నేహితుల మధ్య గొడవే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications