కనిపిస్తే నమస్తే పెట్టవా?: వ్యక్తిపైగా దాడి చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే

హైదరాబాద్: పాతబస్తీలో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. చార్మినార్ బస్ డిపో సమీపంలో యువకుడి పై ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌ దాడి చేశారు. ఎమ్మెల్యే కనిపిస్తే నమస్తే పెట్టవా? అంటూ ముంతాజ్ ఖాన్ హంగామా చేశారు.

అర్ధ రాత్రి 12 గంటలకు గల్లీలో కూర్చున్న యువకుడు జిలానిపై చేయిచేసుకున్నారు ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్. దీంతో ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దాడిపై హుస్సేని అలం పోలీస్ స్టేషన్లో జిలాని ఫిర్యాదు చేశారు. ఎడమ చెవు దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఎడమ చెవి దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు.

Hyderabad: MIM MLA Accused Of Assaulting Man, CCTV Footage Being Probed: Cops.

అయితే.. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌పై కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది హుసేని అలం పోలీసులు. అయితే, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీని పరీశీలిస్తున్నట్లు వెల్లడించారు.

కాగా, ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలో జిలానీ సోదరుడికి ఎమ్మెల్యే తనయుడికి మధ్య ఓ ఆస్తి విషయంతో తగాదాలున్నాయని తెలుస్తోంది.

Recommended Video

    సీడీఎస్‌ బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన బీజేపీ నేత డీకే అరుణ || Oneindia Telugu

    స్థానిక ఎమ్మెల్యేపై ఫిర్యాదులతో తాను గతంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సంప్రదించానని జీలానీ చెప్పారు. "ఈ విషయాన్ని ఓపికగా నిర్వహించమని అసద్ సాబ్ నన్ను కోరినందున నేను నిశ్శబ్దంగా ఉన్నాను. కానీ ఇలా దాడి చేయడం ఆమోదయోగ్యం కాదు," అని అతను చెప్పాడు. ఎప్పుడు నమస్కరించడానికి అతనేమైనా దేవుడా? అని వ్యాఖ్యానించాడు. పోలీసులు కూడా సదరు ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+