జైపూర్ ఎక్స్‌ప్రెస్ కాల్పుల్లో హైదరాబాదీ మృతి: ఆదుకోవాలంటూ ఒవైసీ ట్వీట్
హైదరాబాద్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన కాల్పులు ఘటనలో నలుగురు మృతి చెందిన విషయం విధితమే. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ జరిపిన కాల్పుల్లో.. ఆర్పీఎఫ్ ఏఎస్సైతోపాటు ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. వారిలో హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్ షూట్‌కు చెందిన సయ్యద్ సఫియుల్లా ఉన్నట్లు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు.
మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని, సపియుల్లా కుటుంబాన్ని ఆదుకోవాలని అసదుద్దీన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 'జైపూర్ ఎక్స్‌ప్రెస్ టెర్రర్ అటాక్‌లో నాల్గవ బాధితుడిని సయ్యద్ సైఫుల్లాగా గుర్తించారు. అతను నాంపల్లి బజార్‌ఘాట్‌లో నివాసి. అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, చిన్న కుమార్తె కేవలం 6 నెలల వయస్సు. ఏఐఎంఐఎం నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్ గత కొన్ని గంటలుగా కుటుంబ సభ్యులతో ఉన్నారు. మృతుడి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైఫుల్లా కుటుంబాన్ని ఆదుకోవాలి అని అసదుద్దీన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

జైపూర్ ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటి వెళ్తున్న సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్పులు జరిపాడు. చేతన్ మొదట సీనియర్ అధికారి ఏఎస్సై టికా రామ్ మీనాను కాల్చి చంపాడు. తర్వాత మరో బోగీలోకి వెళ్లి ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Sayed Saifuddin, a native of Nampally, Telangana, has been identified as the fourth victim of the Jaipur Express Attack.
— Meer Faisal (@meerfaisal01) August 1, 2023
Before killing him, Terrorist Chetan Singh allegedly asked his name, according to the victim's family.#JaipurExpressTerrorAttack pic.twitter.com/Wjb0SrRvzz
కాల్పుల అనంతరం దహిసర్ స్టేషన్ వద్ద పారిపోయిందుకు నిందితుడు రైలు నుంచి దూకేశాడు. వెంటనే అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, నిందితుడికి కోపం ఎక్కువ అని.. చిన్న విషయానికే నిందితుడు ఈ దారుణానికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications