సుప్రియ హత్యలో పురోగతి: లవర్‌తో వెళ్లిందని కానిస్టేబుల్ స్టోరీ (పిక్చర్స్)

హైదరాబాద్: కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన కానిస్టేబుల్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసి సిని ఫక్కీలో తప్పించుకుందామనుకున్న కానిస్టేబుల్ రామకృష్మను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా, అతనికి సహకరించిన స్నేహితుడు ప్రదీప్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ రామకృష్ణ ఏడాది కూడా గడువకుండానే భార్యపై అనుమానంతో హత్య చేశాడు. ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

నిజామాబాద్ జిల్లా వాసి రామకృష్ణకు గతేడాది ఆగస్టు 21న అదే జిల్లా వాసి సుప్రియ(19)తో వివాహమైంది. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ ఉంటున్నారు. నిజామాబాద్ జిల్లా వాసి అరుణ్ అనే వ్యక్తిని సుప్రియ ప్రేమిస్తున్నదని పెళ్లైన కొద్దిరోజులకే రామకృష్ణ అనుమానం పెంచుకున్నాడు.

సైకోగా మారిన అతడు గత నెల ఆరున సుప్రియను ఇంట్లోనే టవల్‌తో గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడు ప్రదీప్ సాయంతో సుప్రియ మృతదేహాన్ని పెద్ద సూటుకేసులో పెట్టి, ద్విచక్ర వాహనం పైన వికారాబాద్ అడవికి తీసుకెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించి పాతిపెట్టాడు.

ఏమీ తెలియనట్లు... ఎన్నో జాగ్రత్తలు

భార్యను దారుణంగా హత్య చేసిన అనంతరం తనకు ఏం తెలియనట్లు... గత నెల 14న రామకృష్ణ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుప్రియ తమ్ముడిని కూడా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు.

భార్యను చంపిన కానిస్టేబుల్

భార్యను చంపిన కానిస్టేబుల్

పోలీసులకు తొలిసారి అతనిపై అనుమానం వచ్చి.. సుప్రియను తీసుకొచ్చాక కేసు పరిస్థితిపై మాట్లాడుతామన్నారు. రామకృష్ణ రెండురోజులైనా రాకపోవడంతో పోలీసులు ప్రశ్నించారు. అతడి ప్రవర్తనపై అనుమానంతో తమదైన శైలిలో విచారించడంతో హత్య చేసినట్లు అంగీకరించాడు.

 భార్యను చంపిన కానిస్టేబుల్

భార్యను చంపిన కానిస్టేబుల్

గురువారం వికారాబాద్ అడవికి వెళ్లిన నారాయణగూడ పోలీసులు, సుప్రియ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రామకృష్ణను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా, హత్యకు అతనికి శారీరకలోపం ఉండటమే కారణమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

 భార్యను చంపిన కానిస్టేబుల్

భార్యను చంపిన కానిస్టేబుల్

కాగా, జాతీయస్థాయిలో షీనా బోరా హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. షీనాను తల్లి హత్య ఇంద్రాణి హత్య చేసి అడవుల్లో పాతిపెట్టింది. ఇక్కడ రామకృష్ణ కూడా హత్య చేసి భార్యను వికారాబాద్ అడవుల్లో పాతిపట్టాడు.

 భార్యను చంపిన కానిస్టేబుల్

భార్యను చంపిన కానిస్టేబుల్

షీనా తల్లి ఇంద్రాణి మూడేళ్లుగా కట్టుకథలు అల్లి హత్య విషయాన్ని గప్ చుప్‌గా ఉంచింది. ఇందుకోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. రామకృష్ణ కూడా భార్యను హత్య చేసి ఎన్నో కథలు అల్లాడు. భార్య తప్పిపోయిందని, తనకు తెలియదని, ఆ తర్వాత ఆమె బతికే ఉందని ట్విస్ట్ ఇచ్చాడు. చివరికి చంపేశానని ఒప్పుకున్నాడు. ఇంద్రాణి కూడా తన కూతురును హత్య చేయలేదని ఓ సమయంలో పోలీసులకు షాకిచ్చింది.

ప్రేమించిందని, ఆయనతో వెళ్లిపోయిందని... స్టోరీ నడిపాడు

ఆమె అరుణ్ అనే వ్యక్తిని ప్రేమించిందని, అతనితోనే వెళ్లిపోయి ఉంటుందని పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. భార్యను ఎలాగైనా వెతికి పెట్టాలని రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్లేవాడు.

పోలీసులను తప్పుదారి పట్టించేందుకు సుప్రియ ఫోన్ నుంచి తనకు సందేశాలు వస్తున్నాయని, కాల్ కూడా వచ్చిందంటూ తెలిపాడు. 'నేను అరుణ్‌తో వెళ్లిపోతున్నాను' అని సుప్రియ ఫోన్ నుంచి వచ్చిన సందేశాన్ని పోలీసులకు ఆధారంగా చూపించాడు.

ఇందుకోసం ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సుప్రియ సెల్‌ఫోన్‌ను ప్రదీప్‌కు ఇచ్చి నిజామాబాద్ పంపాడు. అక్కడే రెండుమూడు రోజులు ఉండమని చెప్పి పదే పదే తన భార్య సెల్ నుంచి ఇలాంటి సందేశాలు, ఫోన్ కాల్స్ వచ్చినట్టు స్టోరీ నడిపించాడు.

పోలీసులకు భర్తపై అనుమానం

రామకృష్ణ చెప్పినవి నిజమేనని పోలీసులు తొలుత నమ్మారు. దర్యాప్తు తీవ్రం కావటంతో దొరికిపోతానన్న భయంతో రామకృష్ణ అకస్మాత్తుగా పోలీసులకు షాకిచ్చాడు. నాలుగు రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఫోన్ చేసిందని, తానే తీసుకొస్తానని కేసు మూసేయాలని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+