గర్బిణీ హత్య వెనుక 'మిస్టరీ' ఇదే: ఎలక్ట్రిక్ కట్టర్‌తో ముక్కలుగా నరికేశారు..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ సమీపంలో సంచలనం సృష్టించిన గర్బిణీ హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న కారణంతో భర్త వికాసే ఆమెను హత్య చేశాడని పోలీసులు నిర్దారించారు. పొంతన లేని సమాధానాలతో నీళ్లు నమలుతూ వచ్చిన నిందితులు అమర్ కాంత్, అతని తల్లి మమత, తండ్రి.. ఎట్టకేలకు నోరు విప్పడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. ఇంకా పరారీలోనే ఉన్న వికాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  గర్బిణి హత్య వెనుక వివాహేతర సంబందం?

  గచ్చిబౌలి గర్బిణీ హత్య కేసులో ట్విస్ట్: చంపింది మరిదే.. భర్త కూడా పథకంలో భాగమే?

  అదే కారణం..:

  అదే కారణం..:

  అమర్ కాంత్ ఝా తల్లితో వికాస్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. గత ఐదేళ్లుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయంలో పద్దతి మార్చుకోవాలని వికాస్ భార్య పింకీ అతన్ని పదేపదే హెచ్చరించింది. అమర్ కాంత్ తల్లి మమతో సంబంధం తెంచుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే వికాస్, అమర్ కాంత్ తల్లి మమత ఆమెపై కక్ష పెంచుకున్నారు.

  హత్యకు రెండు రోజుల ముందు కిడ్నాప్.:

  హత్యకు రెండు రోజుల ముందు కిడ్నాప్.:

  తమ వివాహేతర సంబంధానికి పింకీ పదేపదే అడ్డు వస్తుండటంతో.. ఇక ఆమెను లేకుండా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు వికాస్, మమత. ఇదే విషయాన్ని మమత అమర్ కాంత్ తోనూ చెప్పింది. దీంతో అంతా కలిసి ఆమె హత్యకు ప్లాన్ వేశారు. హత్యకు రెండు రోజుల ముందు ఆమెను కిడ్నాప్ చేశారు.

  ఎలక్ట్రిక్ కట్టర్‌తో ముక్కలు చేసి..:

  ఎలక్ట్రిక్ కట్టర్‌తో ముక్కలు చేసి..:


  కిడ్నాప్ చేసి తీసుకొచ్చాక పింకీని అత్యంత దారుణంగా హతమార్చారు. వికాస్ తన కన్న కొడుకు ముందే పింకీని హత్య చేశాడు. హత్యానంతరం ఎలక్ట్రిక్ కట్టర్‌తో ఆమె శరీర భాగాలను ముక్కలు, ముక్కలుగా కోశారు. ముఖాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోలు పోసి తగలబెట్టారు. ఆపై జనవరి 29వ తేదీ తెల్లవారుజామున బొటానికల్ గార్డెన్ సమీపంలో అమర్ కాంత్, అతని తల్లి మమత.. ఆ శవాన్ని కుక్కిన మూటను పడేసి పారిపోయారు.

  అమర్‌కాంత్-వికాస్ పరిచయంతోనే..:

  అమర్‌కాంత్-వికాస్ పరిచయంతోనే..:

  వికాస్ సిద్దిఖీనగర్ లోనే స్థానికంగా ఓ పానీపురి బండి నడుపుతున్నట్టు తెలుస్తోంది.అదే కాలనీలో గత మూడు నెలలుగా అద్దెకు ఉంటున్న అమర్‌కాంత్ ఝాతో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ఇళ్లకు రాకపోకలు మొదలైనట్టు తెలుస్తోంది. అలా అమర్‌కాంత్ తల్లితో వికాస్‌కు వివాహేతర సంబంధం ఏర్పడి ఉంటుందని తెలుస్తోంది.

   మీడియా ముందుకు:

  మీడియా ముందుకు:

  నిందితుడు అమర్ కాంత్ ను కూడా సోమవారం బీహార్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరికొద్దిసేపట్లో నిందితులు అమర్ కాంత్, వికాస్, మమతలను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పింకీని ఇంత దారుణంగా హతమార్చిన నిందితులను వదిలిపెట్టవద్దని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  According to sources, Madhapur Special Operation Team (SOT) chased the sensational murder case,which was reported ten days ago at Botanical garden.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి