పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌కు పోలీసులు బెండు తీస్తారు: ఎఫ్ఐఆర్ నమోదు: సజ్జానర్ ఫైర్

Pallavi Prashanth: బిగ్‍ బాస్ తెలుగు సీజన్‍ 7 విన్నర్ ఎవరో అఫీషియల్‌గా తేలింది. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో విన్నర్ పేరు వెల్లడైంది. రైతు బిడ్డగా గుర్తింపు పొందిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ గెలుచుకున్నాడు.

గ్రాండ్ ఫైనల్ ముగిసిన తరువాత కలకలం చోటు చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన అమర్‌దీప్‌ కారును పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు. చేతికి అందిన వస్తువులను కారు మీదికి విసిరేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. కారు దిగి రావాలంటూ అమర్‌దీప్‌ను సవాల్ చేశారు. కారు ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డారు.

Hyderabad police have files FIR against Bigg Boss Telugu season 7 winner Pallavi Prashanth fans

ఆ సమయంలో అమర్‌‌దీప్, ఆయన తల్లి, భార్య కారులోనే ఉన్నారు. ఈ ఘటనతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులను చెదరగొట్టారు.

ఈ గొడవ అక్కడితో ఆగలేదు. నడిరోడ్డు మీదికి వచ్చింది. కృష్ణానగర్- అన్నపూర్ణ స్టూడియోస్ బస్‌స్టాప్ వద్దా కొట్టుకున్నారు. ఘర్షణకు దిగారు. ఆ మార్గంలో వెళ్లోన్న సిటీ బస్సులపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఆరు సిటీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, రాణిగంజ్.. ఇతర డిపోలకు చెందిన బస్సులు అవి.

బస్సు అద్దాలను పగులగొట్టడంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారి కోసం గాలింపు మొదలు పెట్టారు.

ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మండిపడ్డారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని అన్నారు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే నిప్పులు చెరిగారు. ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+