హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ వర్షం, ప్రజల్లో భయం: నడిరోడ్డుపై భారీ గొయ్యి, నీటమునిగిన భండారీ లేఅవుట్

సోమవారం కురిసిన భారీ వర్షం నుంచి నగరం ఇంకా తేరుకోలేదు. వర్షం కారణంగా బేగంబజార్‌లోని ఓ రోడ్డు కుంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సోమవారం కురిసిన భారీ వర్షం నుంచి నగరం ఇంకా తేరుకోలేదు. వర్షం కారణంగా బేగంబజార్‌లోని ఓ రోడ్డు కుంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది.

<br>నిండిన హుస్సేన్ సాగర్: సెలవు కావడంతో.., భారీ వర్షం ఎందుకిలా?
నిండిన హుస్సేన్ సాగర్: సెలవు కావడంతో.., భారీ వర్షం ఎందుకిలా?

నిత్యం వ్యాపార లావాదేవీలతో రద్దీగా ఉండే ప్రాంతంలో గొయ్యి పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కింది భాగంలో వరద కాలువ ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

<br>భారీ వర్షం, ఎవరం ఏం చేయలేం: తలసాని, 'ఆ దారిలో వెళ్లకండి'
భారీ వర్షం, ఎవరం ఏం చేయలేం: తలసాని, 'ఆ దారిలో వెళ్లకండి'

దీంతో తక్షణమే స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు గొయ్యి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ మళ్లించి జీహెచ్‌ఎంసీ అధికారుల సహాయంతో మరమ్మతులు చేపట్టారు.

మరోవైపు, బుధవారం మరోసారి భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లిలో ఉరుములతో కూడిన వర్షం పడింది. నిజాంపేట, ఎర్రగడ్డ ప్రాంతాల్లోను వర్షం పడింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.

బండారి లేఅవుట్‌ సమీపంలోని తుర్క చెరువు ఉగ్రరూపం

బండారి లేఅవుట్‌ సమీపంలోని తుర్క చెరువు ఉగ్రరూపం

భారీ వర్షం కారణంగా బండారి లేఅవుట్‌ సమీపంలోని తుర్క చెరువు ఉగ్రరూపం దాల్చింది. చెరువు నుంచి వచ్చే వరదతో నిజాంపేట నల్లపోచమ్మ దేవాలయం దగ్గర్లోని చెరువు నిండిపోయింది. బండారీ లేఅవుట్ రోడ్లు అద్వాన్నంగా తయారయింది.

 అపార్టుమెంట్లలోకి నీళ్లు

అపార్టుమెంట్లలోకి నీళ్లు

బండారీ లే అవుట్లలో చెరువు సమీపంలోని అపార్ట్‌మెంట్లలోకి నీరు చేరుతుండటంతో అధికారులు కట్టను తెగ్గొట్టి ప్రవాహాన్ని పక్కకు మళ్లించారు. హుస్సేన్‌ సాగర్‌ అదనపు నీరంతా మారియట్‌ హోటల్‌ వద్దనున్న తూము ద్వారా దిగువకు ప్రవహిస్తోంది.

నష్టపోయిన శివారు ప్రాంతాలు

నష్టపోయిన శివారు ప్రాంతాలు

వర్షాలతో హైదరాబాద్ చిన్నాభిన్నమైంది. శిథిల భవనాలు కుప్పకూలుతున్నాయి. రహదారులు కోతకు గురయ్యాయి. వేలాది మంది బస్తీవాసులు ముంపులోనే గడుపుతున్నారు. గతానికి భిన్నంగా ప్రధాన నగరంతో పోలిస్తే ఈసారి శివారు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి.

అక్రమమల ఎఫెక్ట్ కనిపిస్తోంది

అక్రమమల ఎఫెక్ట్ కనిపిస్తోంది

నాలాలు, చెరువుల ఆక్రమణల దుష్పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి కూడా పలు చోట్ల వర్షం మొదలవడంతో నగరవాసులో మరోసారి భయం మొదలైంది. బుధవారం మరోసారి పలుచోట్ల వర్షం కురుస్తోంది.

మళ్లీ వర్షం, ప్రజల్లో భయం

మళ్లీ వర్షం, ప్రజల్లో భయం

అప్పటికే కాలనీల్లో మోకాళ్ల లోతు నీళ్లు ఉండటం, మళ్లీ వర్షం మొదలవడం కలవరపాటుకు గురిచేసింది. మహానగరంలో శివరాంపల్లి నుంచి మొదలుపెడితే కాటేదాన్‌, బహదూర్‌పుర, చాంద్రాయనగుట్ట, ఎల్‌బీనగర్‌, నాగోల్‌, హయత్‌నగర్‌, ఉప్పల్‌ వరకు ఉన్న జాతీయ రహదారి సోమవారం కురిసిన వర్షంతో అధ్వానంగా తయారైంది.

అపార్టుమెంట్లలోకి నీరు

అపార్టుమెంట్లలోకి నీరు

రామాంతపూర్‌ పెద్దచెరువు నిండటంతో ఎఫ్‌టీఎల్‌లోని కాలనీలు నీట మునిగాయి. పదికిపైగా అపార్ట్‌మెంట్లలోకి వర్షం నీరు చేరింది. రాజేంద్ర నగర్‌లోని చిలకా చెరువు ఉప్పొంగింది. చుట్టుపక్కలున్న కాలనీల్లోకి నీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నడుముల్లొతు వరద ప్రవహించడంతో వాహనాలు కొట్టుకుపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

కొట్టుకుపోయిన కారు, బైక్

కొట్టుకుపోయిన కారు, బైక్

బేగంబజార్‌ మార్కెట్‌లో వర్షం పెను ప్రమాదాన్ని సృష్టించింది. వరద నీటిలో కారు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోగా పలు వ్యాపార సంస్థలు వాటి గోదాములలో నిల్వ ఉన్న వస్తువులు, సామగ్రి తడిసి ముద్దయి భారీగా నష్టం సంభవించింది.

English summary
Relief operations were underway today to restore normalcy in rain-hit areas of the city, a day after three persons died in rain-related incidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X