Hyderabad Real estate: కోకాపేట్‌లో కళ్లు భైర్లు కమ్మే ధరలు..ఏకంగా..!!

హైదరాబాదులో ప్రస్తుతం ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనాలంటే కనీసం కోటి రూపాయలు వరకు అవుతోంది. ఇక ప్రైమ్ ఏరియాల్లో అయితే రెండు కోట్లకు పైగానే ఒక ఫ్లాట్ ధర పలుకుతోంది. గత ఐదేళ్లలో హైదరాబాద్ నుంచి హైదరాబాద్ శివార్ల వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా పెరిగిపోయిందని అనరాక్ రీసెర్స్ (ANAROCK)రిపోర్ట్ పేర్కొంది. చిన్న చిన్న రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా భారీ ధరలతో ఫ్లాట్లను విక్రయిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

ఫ్యూచర్ అంతా కోకాపేట్‌లోనే..

ప్రస్తుతం రియల్ ఎస్టేట‌్‌కు అడ్డాగా మారింది కోకాపేట్. ఇక్కడ ప్రాపర్టీ చాలా హాట్ గురూ అన్నట్లుగా ఉంది పరిస్థితి. కోకాపేట్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ దాదాపుగా 89శాతం మేరా పెరిగింది.2019లో ఒక చదరపు అడుగు (sq.ft) రూ.4750గా ఉండగా 2024 తొలి భాగానికి రూ.9వేలకు పెరిగినట్లు అనరాక్ నివేదిక వెల్లడించింది.అసలు ఇంతలా ధరలు పెరగడానికి కారణం కోకాపేట్ ప్రాంతంకు ప్రీమియం రెసిడెన్షియల్ హబ్‌గా ముద్రపడటమే. కోకాపేట్‌ పరిసరాల్లో కొన్ని ఎంఎన్‌సీ కంపెనీలు ఉండటం, ఇక కొత్తగా వస్తున్న ప్రాజెక్టుల్లో 52శాతంకు పైగా అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్‌ కింద ఉంటూ రూ.2.5 కోట్లు ధర పలకడం వల్లే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పుంజుకుంది.

Hyderabad Real Estate Boom Kokapet Sees Unprecedented 89 Price Surge

కోకాపేట్ తర్వాత బాచుపల్లి

ఒకప్పుడు బాచుపల్లికి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ కాలక్రమంలో బాచుపల్లి వైపు పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడంతో చాలామంది అక్కడ ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ఇప్పుడు బాచుపల్లి కూడా హైదరాబాదులో ఒక హాట్ ప్రాపర్టీ హబ్ అనే చెప్పొచ్చు. 2019లో బాచుపల్లిలో చదరపు అడుగు రూ.3690గా ఉండగా..2024 తొలి భాగంలో రూ.5800గా ఉంది. ఇదిలా ఉంటే తెల్లాపూర్‌లో 2019లో చదరప అడుగు రూ. 4819 ఉండగా ఇప్పుడది రూ.7350కి ఎగబాకింది. మొత్తంగా దేశంలోని టాప్ ఏడు నగరాల్లో హైదరాబాద్ సిటీ 2019 నుంచి 2024 తొలి సగం వరకు సగటున 64శాతం ధరలు పెరిగినట్లు సంస్థ వివరించింది.

తెల్లాపూర్‌లో పెరుగుతన్న రెసిడెన్షియల్ హబ్స్

ఇదిలా ఉంటే తెల్లాపూర్‌లో క్రమంగా నివాస గృహాల సంఖ్య పెరిగిపోతోంది.2019 నుంచి 2024 తొలి సగానికి తెల్లాపూర్‌లో 18,960 కొత్త యూనిట్లు ప్రారంభమయ్యాయి. చదరపు అడుగు సగటున రూ.7350 పలికింది. 2019 ధరలతో పోలిస్తే దాదాపుగా 53 శాతం మేరా ధరలు పెరిగాయి.తెల్లాపూర్‌లో కొత్తగా లాంచ్ అయిన ప్రాజెక్టుల్లో 66శాతం వరకు మిడ్ అండ్ ప్రీమియం సెగ్మెంట్‌లో ఉన్నాయి.మరో 34 శాతం ఫ్లాట్లు/ఇళ్లు రూ.1.5 కోట్లు పైగానే పలుకుతున్నాయి..

Hyderabad Real Estate Boom Kokapet Sees Unprecedented 89 Price Surge

మొత్తానికి హైదరాబాదులో ఒక మధ్య తరగతి కుటుంబం ఇళ్లు కొనుగోలు చేయాలంటే ధరలను చూసి చాలా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో తమ బడ్జట్లో అద్దె ఇంట్లో ఉండేందుకే చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కరోనా సమయంలో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయాయన్నది కేవలం ప్రచారమే కానీ వాస్తవానికి ధరలు ఏమాత్రం తగ్గలేదు.ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సామాన్యుడికి హైదరాబాదులో సొంతింటి కల అందని ద్రాక్షాగానే మిగిలిపోనుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+