ఈ మార్గాల్లో రద్దయిన హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు: ఎందుకంటే?
హైదరాబాద్: నగర ప్రజా రవాణాలో తనవంతు కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు శనివారం తాత్కాలికంగా నిలిచిపోయాయి. ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా శనివారం పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులు గమనించి వారి ప్రయాణాలు నిర్ణయించుకోవాలని సూచించింది.
ఫలక్ నుమా- లింగంపల్లి, లింగంపల్లి - ఫలక్ నుమా, హైదరాబాద్ - లింగంపల్లి, లింగంపల్లి - హైదరాబాద్ మార్గాల్లో నడిచే 10 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించింది. ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని, తమకు సహకరించాలని కోరారు.

ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. రద్దైన రైళ్ల విషయానికొస్తే.. లింగంపల్లి హైదారాబాద్ మార్గంలో 2, లింగంపల్లి హైదరాబాద్ రూట్‌లో 2, ఫలక్‌నుమా- లింగంపల్లి మార్గంలో 3, లింగంపల్లి- ఫలక్‌నుమా మార్గంలో 3 రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సౌత్ సెంట్రల్ రైల్వే వివరాలను వెల్లడించింది.
Due to track maintenance works, the following MMTS services are cancelled on 17th Dec as detailed below:
— South Central Railway (@SCRailwayIndia) December 17, 2022
47139 Lingampalli – Hyderabad
47140 Lingampalli – Hyderabad
47114 Hyderabad – Lingampalli
47118 Hyderabad – Lingampalli
47158 Falaknuma – Lingampalli
ఎంఎంటీఎస్ రైళ్లు నిలిపోవడంతో రోజు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలను చేరుకున్నారు. కొందరు ఆర్టీసీ బస్సులు, మరికొందరు మెట్రో, ఇంకొందరు ప్రైవేట్ వాహనాల సాయంతో తమ తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఎంఎంటీఎస్ ద్వారా తక్కువ ధరకే గమ్యస్థానాలకు చేరుకుంటుండటంతో సామాన్య ప్రజలు ఎక్కువగా ఈ రైళ్లలోనే ప్రయాణిస్తున్నారు.












Click it and Unblock the Notifications