అలెర్ట్.. తెలంగాణలో రేపు ఉదయం నుంచి వైన్స్ బంద్.. మళ్లీ ఆ రోజే ఓపెన్..
తెలంగాణ రాష్ట్ర పండగ బోనాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని మద్యం ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చింది. బోనాల పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ ఇటీవల కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13 తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లో వైన్స్, బార్లు బంద్ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బోనాల పండగ అట్టహాసంగా సాగుతోంది. నెలరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలతో నగరంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వాతావరణం ఉంది. గోల్కోండ, లాల్ దర్వాజ, ఉజ్జయిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ బంద్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ లో నగరంలో ఉజ్జయిని మహింకాళీ బోనాల పండుగ సందర్భంగా శాంతి భద్రతల నేపథ్యంలో నగరంలోని వైన్స్ షాపులను బంద్ చేయాలని అధికారులు నిర్ణయించారు. బోనాల పండగ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ముందస్తుగా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలోని మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది.

ఇక తెలంగాణకు మద్యం అమ్మకాల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 34,600 కోట్ల ఆదాయం వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే మద్యం అమ్మకాలు పెరిగాయని, తద్వారా ఎక్సైజ్ శాఖకు ఆదాయం కూడా పెరిగిందని అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications