హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్

హైదరాబాద్.. ప్రపంచంలోని మహా నగరాల్లో ఒకటిగా ఉంది. మెట్రో పాలిటన్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. అలాగే హైదరాబాద్ లో జనాభా రోజు రోజుకూ పెరిగిపోతోంది. 2025 లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటీ 13 లక్షల 30 వేలుగా ఉంది. 2024 తో పోలిస్తే 2.43 శాతం పెరుగుదల కనిపించింది. ఇలా ఏటా దాదాపు 3 శాతం జనాభా పెరిగిపోతోంది.

అటు జనాభాతో పాటు వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రకాల వాహనాల సంఖ్య చూస్తే 85 లక్షల 22 వేల 286 కు చేరింది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్‌ లో కలిపి ప్రస్తుతం 59 వేల 800 కంపెనీలు ఉన్నాయి. దాంతో హైదరాబాద్ మహా నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయింది. అయితే నగర వాసులకు మెరుగైన, పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాలను అందించేందుకు కీలక ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఎం ఈ-డ్రైవ్ (ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్ హాన్స్ మెంట్) పథకంలో భాగంగా భాగ్యనగరంలో ప్రజల రవాణా కోసం 915 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరాతో పాటుగా నిర్వహణ కోసం లెటర్ ఆఫ్ అవార్డు లభించింది.

Hyderabad to Get 915 Electric Buses EKA GreenCell Secure LOA Under PM e-Drive TGSRTC Electric Bus

ఈ మేరకు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు అమల్లోకి రానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 915 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వీటిలో 9 మీటర్ల పొడవు ఉన్న 100 మినీ బస్సులు, ప్రధాన మార్గాల్లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి 12 మీటర్ల పొడవు ఉన్న 815 స్టాండర్డ్ ఫ్లోర్ నాన్-ఏసీ బస్సులు రానున్నాయి. ఇక ఇటీవల హైదరాబాద్‌ లోని ప్రయాణికులకు ఆర్టీసీ మరో గుడ్‌ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ బస్సు ఛార్జీలను తగ్గించింది. టికెట్‌ ధరల్లో మార్పులు చేయనప్పటికీ డిస్కౌంట్‌ పేరుతో తగ్గింపులు చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+