హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు: 20న ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ దిగ్గజం దివంగత నందమూరి తారక రామారావు(NTR) శత జయంతి వేడుకల సందర్భంగా మే 20వ తేదీన కూకట్‌పల్లి కైత్లాపూర్ మైదానంలో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజు పోలీసులు ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
దాదాపు 15000 నుంచి 20000 మంది సభ్యులు ఈ వేడుకలకు హాజరవుతారని సమాచారం. ఈ నేపథ్యంలో కింది మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా:
మూసాపేట్ నుంచి కెపిహెచ్‌బి-IV ఫేజ్, హైటెక్ సిటీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మూసాపేట్ ఎక్స్-రోడ్-కూకప్తల్లి బస్టాప్-జెఎన్‌టియు జంక్షన్‌కు మళ్లిస్తారు.
IDL లేక్ నుంచి మాదాపూర్, హఫీజ్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్ IDL జంక్షన్ - కూకట్‌పల్లి బస్ స్టాప్ - KPHB రోడ్.నం:01 - JNTU జంక్షన్‌కు మళ్లించబడుతుంది.
హైటెక్ సిటీ నుంచి కూకట్‌పల్లి, మూసాపేట్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్‌ను KPHB-IV ఫేజ్ - లోధా అపార్ట్‌మెంట్స్ - KPHB రోడ్ నం.01 మీదుగా మళ్లిస్తారు.
పర్వత్ నగర్, మాదాపూర్ నుంచి కూకట్‌పల్లి వైపు వచ్చే ట్రాఫిక్, మూసాపేట్ రహదారి SBI సిగ్నల్ - NIA - ఎడమ మలుపు - 100 అడుగుల సిగ్నల్ U-టర్న్‌కు మళ్లిస్తారు.
ఈ క్రమంలో ప్రయాణీకులందరూ పై సలహాను పాటించవలసిందిగా, ట్రాఫిక్ సజావుగా ఉండేలా సహకరించవలసిందిగా ట్రాఫిక్ పోలీసులు కోరారు.












Click it and Unblock the Notifications