భారత్ Vs ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్: 60 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) శుభవార్త చెప్పింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 బస్సులను నడుపుతోంది. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 7 గంటల వరకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాలని క్రికెట్ అభిమానులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.

కాగా, స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో భారత తలపడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఈ సిరీసీ టీమిండియాకు కీలకం కానుంది. తొలి టెస్టు గురువారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. టీమిండియాకు కలిసి వచ్చే మైదానం కావడం గమనార్హం. టెస్టుల్లో భారత జట్టు ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బూమ్రా (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్/కు్లదీప్ యాదవ్/అక్షర్ పటేల్.
ఇంగ్లాండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్టీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.












Click it and Unblock the Notifications