సోమాలియాలో నరకం చూస్తున్న నా సోదరిని కాపాడండి: సుష్మాకు హైదరాబాదీ వేడుకోలు
హైదరాబాద్: సోమాలియాలో నరకం అనుభవిస్తోన్న తన సోదరిని కాపాడాలని హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను వేడుకున్నారు. తన సోదరి మొహమ్మదీ బేగమ్‌కు, ఆమె పిల్లలకు కనీసం తిండి కూడా పెట్టకుండా అత్తింటివారు వేధిస్తున్నారని సోదరుడు మొహమ్మద్ వహియుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు.
'నా సోదరికి 2003లో సోమాలియా జాతీయుడైన సయ్యద్ హసన్ ఇబ్రహీంతో వివాహం జరిగింది. వారు అప్పటి నుంచి 2013 వరకు హైదరాబాద్‌లో మాతో పాటే ఉండేవారు. వారికి ఐదుగురు పిల్లలు జన్మించారు. 2013లో సోమాలియాలో ఉన్న తన తల్లిదండ్రులు పిల్లలను చూడాలంటున్నారని సయ్యద్ చెప్పడంతో నా సోదరి, పిల్లలతో సహా అక్కడికి వెళ్లింది. సయ్యద్ మాత్రం ఒక సంవత్సరం పాటు ఇక్కడే ఉండి, ఆ తరవాత అమెరికా వెళ్లిపోయాడు. నా సోదరి,ఆమె పిల్లలు సోమాలియాలోనే ఉండిపోయారు' అని వహియుద్దీన్ తెలిపారు.

ఆ తర్వాత 'సయ్యద్ కుటుంబ సభ్యులు నా సోదరికి, ఆమె పిల్లలకు కనీసం తిండి కూడా పెట్టకుండా వేధింపులకు గురి చేస్తున్నారు' అని వహియుద్దీన్ మీడియా ఎదుట వాపోయాడు. వెంటనే వారిని కాపాడాలని విదేశాంగమంత్రిని అభ్యర్థించాడు. ఎటువంటి ఆలస్యం చేయకుండా తన సోదరిని, ఆమె పిల్లలను భారత్ తీసుకురావాలని వేడుకున్నారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications