• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లండ‌న్‌లో హైద‌రాబాదీ దారుణ‌హ‌త్య‌: కేసీఆర్ స‌ర్కార్‌ను ఆశ్ర‌యించిన బాధిత కుటుంబం

|

లండ‌న్: జీవ‌నోపాధి కోసం లండ‌న్‌కు వెళ్లిన హైద‌రాబాద్‌కు చెందిన యువ‌కుడొక‌రు దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. స్థానిక కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆయ‌న స‌హ ఉద్యోగే ఈ దారుణానికి పాల్ప‌డి ఉంటార‌నే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. హ‌తుడి పేరు మ‌హ‌మ్మ‌ద్ న‌దీముద్దీన్‌. హైద‌రాబాద్‌లోని నూర్‌ఖాన్ బ‌జార్‌కు చెందిన యువ‌కుడు. జీవనోపాధి కోసం ఆరేళ్ల కింద‌ట లండ‌న్‌కు వెళ్లారు. టెస్కో సూప‌ర్ మార్కెట్‌లో సేల్స్ రెప్ర‌జంటేటివ్‌గా ప‌నిచేస్తున్నారు.

గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు భూకంపాలు: సునామీ భ‌యంతో వ‌ణికిన జ‌పాన్‌!

బుధ‌వారం రాత్రి న‌దీముద్దీన్ ఇంటికి వెళ్ల‌లేదు. స‌మ‌యం గ‌డుస్తున్న‌ప్ప‌టికీ..ఆయ‌న ఇంటికి రాక‌పోవడంతో ఆందోళ‌న‌కు గురైన ఆయ‌న భార్య సూప‌ర్ మార్కెట్ యాజ‌మాన్యానికి ఫోన్ చేశారు. దీనితో అనుమానం వ‌చ్చిన సూప‌ర్ మార్కెట్ మేనేజ‌ర్‌, ఇత‌ర సిబ్బంది మాల్ ఆవ‌ర‌ణ‌లో గాలించారు. మాల్ భ‌వ‌న స‌ముదాయం సెల్లార్‌లోని పార్కింగ్‌లో న‌దీముద్దీన్ ర‌క్తపు మ‌డుగులో నిర్జీవంగా క‌నిపించారు. వెంట‌నే ఈ విష‌యాన్ని అక్క‌డి సిబ్బంది.. హైద‌రాబాద్ నూర్‌ఖాన్ బ‌జార్‌లో నివ‌సిస్తున్న న‌దీముద్దీన్ స్నేహితుడు ఫ‌హీమ్ ఖురేషీకి తెలియ‌జేశారు.

Hyderabadi stabbed to death in London

న‌దీముద్దీన్ భార్య ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ద‌ర్యాప్తు చేప‌ట్టారు. న‌దీముద్దీన్‌కు ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తులు లేదా, స‌హోద్యుగులే ఆయ‌నను హ‌త్య చేసి ఉంటార‌ని ప్రాథ‌మికంగా నిర్ధారించారు. ఆ కోణంలో విచార‌ణ ఆరంభించారు. ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భిణి అని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు.

ఆరేళ్లుగా లండ‌న్‌లో నివ‌సిస్తున్న న‌దీముద్దీన్‌.. బ్రిటీష్ పౌర‌స‌త్వం కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్నార‌ని, మ‌రి కొన్ని నెల‌ల్లో ఈ ప్ర‌క్రియ ముగియ‌బోతోంద‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. అంత‌లోనే ఈ దారుణం చోటు చేసుకుంద‌ని క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా- న‌దీముద్దీన్ మృత‌దేహాన్ని భార‌త్‌కు ర‌ప్పించ‌డానికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ఫ‌హీమ్ ఖురేషీ.. విదేశాంగ మంత్రిత్వ‌శాఖ‌, తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీని ను ఆశ్ర‌యించారు. మృత‌దేహాన్ని తీసుకుని రావ‌డానికి తాను లండ‌న్ వెళ్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Hyderabad man was murdered, allegedly by another Asian, in London on Wednesday. Mohd Nadeemuddin, of Noor Khan Bazaar, was working at a mall in Tesco Supermarket and was living in London for the last six years. His wife, a medicine graduate, joined him a month ago in London. According to reports reaching here, Nadeem was stabbed to death by another Asian worker who worked at the Tesco supermarket. The murder came to light when the family of Nadeem called up the supermarket management when the victim did not reach home after completing his job hours on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more