హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు

హైదరాబాద్‌ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ అనేక రకాల జంతువులు, పక్షులు, కీటకాలు, సరీసృపాలు, మొసళ్లు ఇలా ఒక్కటేమిటి అన్ని జంతువులకు నిలయంగా ఉంటుంది. జూపార్క్ కు సాధారణంగా వేసవి సెలవులు, ఇతర హాలీడేస్ లో ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక జూపార్క్ లో ఎప్పటికప్పుడు కొత్త జంతువులను తీసుకొస్తుంటారు అధికారులు. ఇక్కడి జంతువుల్ని ఇతర రాష్ట్రాలకు.. అలాగే అక్కడి అరుదైన జంతువుల్ని మన రాష్ట్రానికి తరలిస్తుంటారు. ఎక్స్ఛేంజ్ విధానంలో ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

అయితే ఈ సంప్రదాయంలో భాగంగా తాజాగా నెహ్రూ జూలాజికల్ పార్క్ లోకి కొత్తగా రెండు మగ మాండ్రిల్స్ (కోతి జాతి జంతువులు) వచ్చి చేరాయి. ఈ అరుదైన కోతుల వయసు ప్రస్తుతం 23 నెలలు ఉంది. వీటిని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ వినయ్ కుమార్, సంరక్షకురాలు వసంత కలిసి సందర్శకుల కోసం ఎన్ క్లోజర్ లోకి విడుదల చేశారు. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలో భాగంగా వీటిని జంషెడ్‌‌పూర్ జూ నుంచి తీసుకొచ్చారు. ఇక వీటికి బదులుగా హైదరాబాద్​ జూ నుంచి ఒక జత ఆఫ్రికన్ సింహాలను అక్కడికి పంపించారు అధికారులు.

ఈ మాండ్రిల్స్ కోతులు గత నెలలోనే జూకు చేరుకున్నాయి. అయితే రూల్స్ ప్రకారం ఈ జంతువులను 45 రోజులపాటు క్వారెంటైన్ లో ఉంచారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాకే గురువారం నుంచి ఈ జంతువులను ప్రజల సందర్శన కోసం అనుమతించారు. ఇక సాధారణంగానే నిత్యం వేల సంఖ్యలో జూపార్క్ ను సందర్శిస్తుంటారు. ఇలా కొత్త రకం జంతువులు వచ్చిన విషయం తెలియడంతో జూపార్క్ లో సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక వేసవి కారణంగా జూపార్కులో తాగునీటి సదుపాయాలను విస్తరించారు. జూపార్క్ లోని ఒక్కో విభాగం వద్ద సెక్యూరిటీ గార్డులను మోహరించి పర్యటకులు ఇబ్బందులు పడకుండా చూస్తున్నారు. ఈవీకెండ్ లో మరింత మంది పర్యటకులు జూపార్క్ ను సందర్శించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు జూపార్క్ అధికారిణి వసంత తెలిపారు.

HyderabadZoo Welcomes Mandrill Monkeys Tourists Rush in Large Numbers to See Them Mandrill Monkeys

ఇక నెహ్రూ జూలాజికల్ పార్క్ మీర్ ఆలం ట్యాంక్ సమీపంలోని బహదూర్‌ పురాలో ఉంది. ఈ పార్కు దాదాపు 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. జూపార్కును ప్రతి సోమవారం మూసివేస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుంది. టికెట్ ధరలు చూస్తే.. పెద్దలకు (12 సంవత్సరాల కంటే ఎక్కువ) రూ. 100 ఉంది. అలాగే పిల్లలకు (3 నుంచి 12 సంవత్సరాలు) రూ. 50 గా నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+