జస్ట్ రూ. 400కే గోవా టూర్.. సికింద్రాబాద్ నుంచి.. బీచ్ లో ఫుల్ ఎంజాయ్..!
గోవా అంటేనే మంచి కిక్ ఇచ్చే టూర్. గోవా టూర్ అంటే యువతకు మాత్రమే కాదు.. ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కపుల్స్, ఫ్యామిలీస్ కూడా గోవాకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు దగ్గర్లోనే గోవా ఉండటంతో ఏటా వందలాది మంది ఇక్కడికి వెళ్తుంటారు. ఇక వేసవి సెలవుల్లో అయితే ఫ్రెండ్స్ తో కలిసి అలా గోవాను చుట్టేయడం ఆనవాయితీగా మారిపోయింది. గోవా.. భారత్ లోని అందమైన చిన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది.
గోవాలోని బీచ్ లు, చారిత్రక ప్రదేశాలు, పురాతన కోటలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గోవా చాలా వరకు బీచ్ లతోనే నిండిపోయి ఉంటుంది. బాగా బీచ్, కలంగుట్ బీచ్, అంజునా బీచ్, పలోలెం బీచ్, వగేటర్ బీచ్.. ఇలా అనేక సుందరమైన బీచ్ లు వేసవిలో పర్యటకులతో నిండిపోతాయి.
బీచ్ లతో పాటు గోవాలో ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చి చాలా ఫేమస్. పంజిమ్ లోని ఈ చర్చి 17వ శతాబ్దానికి చెందినదిగా చెబుతారు. ఈ ఆలయం గోవాలోని పురాతన మత దేవాలయాలలో ఒకటిగా ఉంది. గోవాకు వచ్చే వాళ్లకు ఇదొక ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంటోంది. ఇక పంజిమ్ కు దాదాపు 21 కి. మీ దూరంలో ఉన్న అంజునా మార్కెట్ లో 50 ఏళ్ల నాటి దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ పర్యటకులు బట్టలు, నగలతో పాటు అనేక ఇతర వస్తువులను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అలాగే బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్.. 1594లో నిర్మించిన ఈ చారిత్రాత్మక గోవా దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఏటా నవంబర్, డిసెంబర్ లలో దీన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
అలాగే దూద్ సాగర్ జలపాతం.. గోవాలోని ప్రసిద్ధ దూద్ సాగర్ జలపాతం వర్షాకాలంలో అద్భుతంగా ఉంటుంది. "ఓషన్ ఆఫ్ మిల్క్" అని పిలిచే ఈ జలపాతం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇది గోవాలో ఎత్తైన జలపాతాలలో ఒకటిగా నిలుస్తోంది. దాంతోపాటు అర్వాలెం జలపాతం కూడా పర్యటకులను ఆకట్టుకుంటోంది. ఇక గోవాను సందర్శించడానికి నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

అయితే హైదరాబాద్ నుంచి కేవలం రూ. 400 కే గోవా టూర్ వెళ్లొచ్చు. సికింద్రాబాద్ నుంచి గోవాలోని మడ్గావ్ నగరానికి 17039 SC VSG EXPRESS ప్రయాణిస్తోంది. ఇది ప్రతి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. సుమారు 19 గంటల ప్రయాణం తర్వాత గోవా చేరుకుంటుంది. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే.. స్లీపర్ కోచ్ టికెట్ ధర రూ. 430 గా ఉంది. అలాగే 3E క్లాస్ టికెట్ ధర రూ. రూ.1075గా నిర్ణయించారు. 3A టికెట్ ధర రూ. 1160 కాగా.. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ధర రూ. 2,795గా ఉంది. ఇక టూరిస్టులు మడ్గావ్ లో దిగిన తర్వాత గోవాలోని ప్రముఖ పర్యటక ప్రాంతాలన్నీ దాదాపు 10 కి. మీ. లోపే ఉన్నాయి.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications