పక్కా హిందువును- హిందువుగానే చనిపోతా.. కానీ: కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిందువుగా జన్మించానని, హిందువుగానే మరణిస్తానని చెప్పారు.

హైదరాబాద్: ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార భారత్ రాష్ట్ర సమితిపై ఘాటు విమర్శలను సంధించారు. బీఆర్ఎస్ ఆవిర్భావానికి గల కారణాలను ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్- భారతీయ జనతా పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదని, ఈ రెండు పార్టీలు ఒకే లైన్ లో వెళ్తోన్నాయని ఆరోపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అజెండాను అమలు చేస్తోన్నాయని స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ పై..

ఫోన్ ట్యాపింగ్ పై..

మొన్నటికి మొన్న వివాదాస్పదమైన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కేఏ పాల్ లేవనెత్తిన విషయం తెలిసిందే. తన ఫోన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాప్ చేయిస్తోన్నారంటూ ఆరోపించారు. కేంద్రంలో తాను ఏ మంత్రితో మాట్లాడుతున్నాననేది కేసీఆర్ వింటోన్నారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని ట్యాపింగులు చేసినా తనకేమీ అభ్యంతరం లేదనీ అన్నారు. బీఆర్ఎస్ ను ప్రకటించిన తరువాత కేసీఆర్ ఇక గెలిచే ప్రసక్తే ఉండదని కేఏ పాల్ జోస్యం చెప్పారు.

బీజేపీకి బీ- టీమ్

బీజేపీకి బీ- టీమ్

బీజేపీకి బీ-టీమ్ గా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని కేఏ పాల్ విమర్శించారు. కొండగట్టు ఆలయానికి 600 కోట్లను రూపాయలను కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆర్ఎస్ఎస్ అజెండాను కేసీఆర్ అనుసరిస్తోన్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని ప్రశ్నించారు. ఖజానా ఖాళీ అయిందని ఒకవంక చెబుతూ- మరో వంక కొండగట్టు, యాదాద్రి ఆలయాలకు కోట్ల రూపాయలను ఎలా మంజూరు చేస్తోన్నారని కేఏ పాల్ ప్రశ్నించారు.

మసీదులు, చర్చ్ లకు..

మసీదులు, చర్చ్ లకు..

తెలంగాణలో ఒక్క మసీదు లేదా చర్చికి ఏనాడైనా కేసీఆర్ నిధులను మంజూరు చేశారా? అంటూ ప్రశ్నించారు. దీనిపై సెక్యులర్లు కేసీఆర్‌ ను నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. విలువైన ప్రభుత్వ భూములను తెగనమ్మి కొండగట్టు ఆలయాభివృద్ధికి నిధులను మంజూరు చేయడంపై తాను కోర్టును ఆశ్రయిస్తానని కేఏ పాల్ అన్నారు.

హిందువును..

హిందువును..

కొండగట్టు ఆలయం అభివృద్ధి కోసం కేసీఆర్ కోట్ల రూపాయలను మంజూరు చేయడాన్ని ఎందుకు తప్పు పడుతున్నారంటూ కేఏ పాల్ ను విలేకరులు ప్రశ్నించగా.. దానికి ఆయన- తాను పుట్టుకతోనే హిందువునని సమాధానం ఇచ్చారు. ఇప్పటికీ హిందువునేనని, హిందువుగానే చనిపోతాననీ చెప్పారు. గతంలో తాను రాసిన నాలుగు పుస్తకాల్లో ఇదే విషయాన్ని పొందుపర్చానని, అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ స్పష్టం చేశానని అన్నారు. తాను జీసస్, మహాత్మాగాంధీ, మదర్ థెరిసా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విధానాలను అనుసరిస్తోన్నానని, వారి ఫాలోవర్ ను అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+