ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర - సీఎస్ పై గవర్నర్ ఆగ్రహం..!!

తెలంగాణ గవర్నర్ తమిళసై సీఎస్ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.

తెలంగాణ గవర్నర్ తమిళసై సీఎస్ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. గవర్నర్ ప్రభుత్వ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ పెట్టటం పైన ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. బిల్లులను ఆమోదించేలా గవర్నర్ ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీకోర్టును కోరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ ను హోలీ సెలవుల తరువాత విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఇందులో గవర్నర్ ను ప్రతివాదిని చేసారు. ఇదే సమయంలో గవర్నర్ తాజాగ ట్వీట్లు చేసారు. అందులో సీఎస్ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాజ్‌భవన్‌కు రావడానికి టైమ్‌ లేదా అంటూ గవర్నర్‌ సీఎస్ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన మీకు.. అధికారికంగా రాజ్‌భవన్‌ని సందర్శించడానికి టైం దొరకలేదు.. మర్యాదపూర్వకంగా పిలిచినా మర్యాద లేదు అంటూ గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తంచేశారు. స్నేహపూర్వకంగా సందర్శించినా, మాట్లాడినా.. ఇంతకంటే సులువుగా బిల్లులు ఆమోదం జరిగేవి అంటూ తమిళిసై వివరించారు.

i remind you Rajbhavan is nearer than Delhi : Governor Dr Tamilisai angry over CS Santhi Kumari

స్నేహపూర్వక చర్చల ద్వారానే బిల్లులు ఆమోదం పొందుతాయని గవర్నర్ పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా కనీస మర్యాదగా ఫోన్‌లో కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరగా ఉందన్న విషయం గుర్తించుకోవాలని.. మరోసారి గుర్తుచేస్తున్నానంటూ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం..గవర్నర్ మధ్య కొంత కాలంగా గ్యాప్ కొనసాగింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో దూరం తగ్గిందని అందరూ భావించారు. గవర్నర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసం కోసం ప్రభుత్వం ఆహ్వానించటం.. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం యధాతధంగా చదవటం ద్వారా విభేదాలు సమసిపోయినట్లుగా విశ్లేషణలు వచ్చాయి.

అయితే, ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయటం..ఇప్పుడు గవర్నర్ చేసిన ట్వీట్లతో ఈ సమస్య కొత్త టర్న్ తీసుకుంది. సుప్రీంకోర్టులో ఈ పిటీషన్ పైన ఎలా స్పందిస్తోందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+