నేను, రేవంత్, హరీశ్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులమే: బండి సంజయ్

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్‌, కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు.

తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఊసే లేదని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై ట్యాపింగ్‌ కేసును నీరుగార్చాయని విమర్శించారు. అనేక అంశాలపై సిట్‌లు వేయడం, మూసివేయడం సాధారణంగా మారిందని బండి సంజయ్ విమర్వించారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు.

I Revanth reddy and Harish Rao also Phone tapping victims Bandi Sanjay

ఫోన్‌ ట్యాపింగ్ కేసును నీరుగార్చి కేసీఆర్‌ కుటుంబాన్ని కాపాడేందుకు యత్నిస్తున్నారని రేవంత్ సర్కారుపై బండి సంజయ్ మండిపడ్డారు. ఈ కేసును నీరుగార్చడంలో కరీంనగర్‌ మంత్రి హస్తం ఉందన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు. పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు చెప్పారని, ఆయన ఏం చెప్పారో పోలీసు రికార్డులో ఉందని తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్‌లో తాను, రేవంత్‌రెడ్డి తోపాటు హరీశ్ రావు కూడా బాధితుడిలమేనని బండి సంజయ్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌ ఇప్పుడే కాదు, అసెంబ్లీ ఎన్నికల నుంచి జరుగుతోంది. నా కుటుంబసభ్యులు, సిబ్బంది ఫోన్లనూ ట్యాప్ చేశారు. 317 జీవో, టీఎస్‌పీఎస్సీ వివాదంలోనూ నా అరెస్టుకు ఫోన్ ట్యాపింగే కారణమని బండి సంజయ్ చెప్పారు. ట్యాపింగ్‌ విషయంలో హరీశ్‌రావు కూడా బాధితుడే. ఏడాదిపాటి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు.

ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావు కరీంనగర్ వాసి. అన్ని ఆర్థిక లావాదేవీలు నడిపింది ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావే అని సంజయ్ ఆరోపించారు. ప్రభాకర్‌రావు, అశోక్‌రావు ద్వారా కాంగ్రెస్ నేతలకు రూ.కోట్లు చేరాయని బండి సంజయ్ ఆరోపించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు డబ్బులు చేతులు మారాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన డబ్బు ప్రభాకర్‌రావు హస్తం పార్టీకి ఇచ్చారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్‌తో కేసీఆర్, కేటీఆర్‌కు సంబంధం ఉందన్నరు బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదు? కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటి వాళ్లు. ఆ రెండు పార్టీలు గెలిచినా ఫర్వాలేదు కానీ బండి సంజయ్ గెలవద్దని కోరుకుంటున్నారు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

మంత్రికి, కేసీఆర్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం ఏంటి? అని ప్రశ్నించారు. . కరీంనగర్‌కు చెందిన మంత్రి ద్వారా ఢిల్లీకి డబ్బులు వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నయీం కేసు, డ్రగ్స్ కేసు, మియాపూర్ భూముల కేసు లెక్కనే ఫోన్ ట్యాపింగ్‌ను నీరుగారుస్తున్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+