'2019లో పాలకుర్తి నుండే, జనగామకు వెళ్ళను, కడియం నిజాయితీపరుడు'

వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నుంచే పోటీ చేస్తానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తాను ఎందుకు పోటీ చేస్తానని ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు.

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నుంచే పోటీ చేస్తానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తాను ఎందుకు పోటీ చేస్తానని ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు.

2019 ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నుండి కాకుండా జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఖండించారు. బుదవారం నాడు దయాకర్‌రావు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. పాలకుర్తి నుండే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.

2019లో పాలకుర్తి నుండే పోటీ చేస్తా

2019లో పాలకుర్తి నుండే పోటీ చేస్తా

2019 ఎన్నికల్లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. పాలకుర్తిని వదిలి జనగామ నుండి పోటీ చేస్తారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌ను అభివృద్ధి చేశానని దయాకర్‌రావు అభిప్రాయపడ్డారు. ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు తనకే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నుంచే పోటీ చేసి 60వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని అని ఆశాభావం వ్యక్తం చేశారు.

వర్ధన్నపేట నుండి పాలకుర్తికి

వర్ధన్నపేట నుండి పాలకుర్తికి

2009 ఎన్నికల సమయంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌కు మారారు. 2009కి ముందు దయాకర్‌రావు వర్థన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్‌ నుండి ప్రాతినిథ్యం వహించారు. అయితే వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. దీంతో 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దయాకర్‌రావు పాలకుర్తి సెగ్మెంట్‌కు మారారు.ఈ స్థానం నుండి 2009, 2014 నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అయితే ఇటీవల మారిన పరిస్థితుల కారణంగా దయాకర్‌రావు టిఆర్ఎస్‌లో చేరారు.

సుధాకర్‌రావు కాదని

సుధాకర్‌రావు కాదని

పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి యతిరాజారావు తనయుడు సుధాకర్‌రావు కూడ ఆ సమయంలో టిడిపి టిక్కెట్టును ఆశించారు. అయితే చంద్రబాబునాయుడు ఆ సమయంలో ఇద్దరికి టిక్కెట్లు ఇవ్వడం కుదరదని చెప్పారు.దీంతో సుధాకర్‌రావును ఒప్పించి దయాకర్‌రావు పాలకుర్తి నుండి పోటీ చేశారనే ఆ సమయంలోనే టిడిపిలో ప్రచారంలో ఉంది. ఆ తదనంతరం చోటుచేసుకొన్న పరిణామాల్లో సుధాకర్‌రావు టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం దయాకర్‌రావు కూడ టిఆర్ఎస్‌లో చేరారు.

కడియం నిజాయితీ గల వ్యక్తి

కడియం నిజాయితీ గల వ్యక్తి

డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి నిజాయితీతో పనిచేస్తారని దయాకర్‌రావు అభిప్రాయపడ్డారు. పక్కా నిబంధనల ప్రకారం కడియం శ్రీహరి పనిచేస్తారని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా అందరం కలిసి జిల్లా అభివృద్ధి కోసం పని చేస్తున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+