కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరుతున్నా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (BSP) పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారత రాష్ట్ర సమితి(BRS)లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకోనున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు. తన రాజకీయ భవితవ్యంపై హైదరాబాద్‌లో ఆదివారం వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులతో మేథోమథనం జరిపినట్లు తెలిపారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. తన వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన వారందరికీ ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని.. దేశంలో లౌకికత్వం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం సోమవారం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటానన్నారు. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
కాగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఇటీవల కలిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుపై చర్చించారు. అప్పుడే పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఈ క్రమంలోనే బీఎస్పీ అధినేత్రి మాయామవతి కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు అంగీకరించారు. ః
ఈ నేపథ్యంలోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేస్తాయని రాజకీయంగా జరుగుతుండగానే.. మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ బీఎస్పీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్దమయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయనతోపాటు బీఎస్పీ రాష్ట్ర నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఇక, బీఆర్ఎస్ పార్టీ నుంచే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications