బతుకమ్మ, ఈ 9 రోజులు ఎవరినీ ఏమీ అనను: కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
కరీంనగర్: కొందరు రాజకీయ విమర్శలు చేస్తున్నారు గానీ బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తాను రాజకీయ విమర్శలు చేయబోనని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లోని బస్ డిపో మైదానంలో బంగారు బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
ఆశా కార్యకర్తల సమస్యలను కేంద్ర ప్రభుత్వం తీర్చాల్సి ఉంటుందని అన్నారు. తాను కూడా ఆశా కార్యకర్తల సమస్యలను తీర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతానని, వారికి న్యాయం చేస్తానని ఆమె చెప్పారు. ఆశ కార్యకర్తలు సమ్మె విరమించిం తమతో పాటు సంబురాల్లో పాల్గొనాలని ఆమె కోరారు. దేశంలో ఆడపిల్లలు వందకు వంద శాంత చదువుకున్న రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని ఆమె అన్నారు.
హుస్నాబాద్ కాకతీయులు పరిపాలించిన ప్రాంతమనిస ఇక్కడ వెయ్యికి పైగా గుడులు కట్టించారని, 750కిపైగా చెరువులు తవ్వించారని, కాకతీయ వీరవనిత రుద్రమదేవి స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ముందుకెళ్దామని కల్వకుంట్ల కవిత అన్నారు.
పదిహేను నెలల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్‌కు మూడసార్లు వచ్చారని, నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే రూ.450 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్, వరంగల్‌తోపాటు కరీంనగర్‌లో కూడా పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

బతుకమ్మ పేర్చిన కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా బతుకమ్మను పేర్చి, మహిళలతో ర్యాలీగా హుస్నాబాద్‌లోని డిపో గ్రౌండ్స్‌కు చేరుకుని బతుకమ్మల ఆడారు.

సగం మంది ఆడబిడ్డలే...
తెలంగాణ జనాభాలో సగం మేర అడబిడ్డలు ఉన్నారనీ, వారు అనుకుంటే ఏదైనా సాధిస్తారని కల్వకుంట్ల కవిత అన్నారు.

తీర్చి దిద్దాలి...
దేశంలో వంద శాతం మహిళలు అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని కల్వకుంట్ల కవిత ఆశించారు.

మంచి విద్య అందుతుంది
అందరికీ విద్య కోసం ప్రభుత్వం త్వరలో కేజీ టూ పీజీ విద్యావిధానాన్ని అమలు చేయబోతున్నదని కవిత అన్నారు. ఈ విధానంతో పేదలకు కూడా మంచి విద్య అందనున్నదన్నారు.

ఇక్కడా పరిశ్రమలు..
హైదరాబాద్, వరంగల్‌తోపాటు కరీంనగర్ జిల్లాలో కూడా పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.

బతుకమ్మ ఆడారు...
బంగారు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన మంగళవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని డిపో గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications